Gunturలో యువకుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-06-25T15:49:30+05:30 IST

జిల్లాలోని పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో కుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Gunturలో యువకుడు దారుణ హత్య

గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో కుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు యువకుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-25T15:49:30+05:30 IST