వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T05:39:20+05:30 IST

జిల్లాలో పలు చోట్ల గురు పౌర్ణమి వేడుక లను భక్తులు శనివారం ఘనంగా నిర్వహిం చారు. కోరుట్ల పట్టణం లోని పలు దేవాల యాలలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించా రు.

వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు
కోరుట్ల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు

కోరుట్ల, జూలై 24: జిల్లాలో పలు చోట్ల గురు పౌర్ణమి వేడుక లను భక్తులు శనివారం ఘనంగా నిర్వహిం చారు. కోరుట్ల పట్టణం లోని పలు దేవాల యాలలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించా రు. పట్టణంలోని సాయి బాబ దేవాలయంలో పండితులు ప్రత్యేక పూజలు అభిషేకాలు ని ర్వహించి సామూహిక సత్యనారాయణ వత్రాల ను జరుపగా దంపతులు అదిక సంఖ్యలో పాల్గొన్ని మొక్కలు చెల్లించుకున్నారు. మురళీ కృష్ణ దేవాల యంలో నిర్వాహకులు సుందర సత్సంగ్‌ అద్వర్యం లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. గీతా పారా యణం, భజన కార్యక్రమాలను నిర్వహించారు. ప ట్టణంలోని కోటి నవదుర్గ దేవాలయంలో వేదపం డితులు ప్రత్యేక పూజలను నిర్వహించి చండీహో మం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా కార్యక్రమా లలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 


Updated Date - 2021-07-25T05:39:20+05:30 IST