భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

Jul 25 2021 @ 00:26AM
కౌట(బి) శబరిమాత ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

బోథ్‌, జూలై 24: మండలంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని శబరిమాత ఆశ్రమంతో పాటు వివిధ ఆశ్రమంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కౌఠ(బి)లో జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ గురువైన శభరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోథ్‌లోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే, మండల కేంద్రంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని 1993-1994 10వ తరగతి బ్యాచ్‌ విద్యార్థులకు తమకు విద్యా బుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించి పాదపూజ చేశారు.
భీంపూర్‌: మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా శనివారం వేంకటేశ్వర ఆలయంలో విశేష పూజలు చేశారు. సాయిభక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  
తాంసి: గురుపౌర్ణమి పండుగను శనివారం మండలంలోని ఆయా గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని పొన్నారి, హస్నాపూర్‌, జామిడి,వడ్డాడి, తాంసి, గిరిగావ్‌ గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Follow Us on: