భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ABN , First Publish Date - 2021-07-25T07:01:01+05:30 IST

దర్శిలో పలు సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
తాళ్లూరులో బాబాకు పూజలు చేస్తున్న మద్దిశెట్టి రవీంద్ర

దర్శి, జూలై 24 : దర్శిలో పలు సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.పట్టణ సమీపంలోని ఎన్‌ఏపీ చెరువు వద్ద ఉన్న సాయిబాబా నాగసాయి దత్తాశ్రయంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందించటంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పొదిలి రోడ్డు, లంకోజనపల్లి రోడ్డులోని సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. 

తాళ్లూరు : గురుపూర్ణమి సందర్బముగా  మండలంలోని  కొత్తపాలెం, నాగంబొట్లపాలెం సాయిబాబా ఆలయాల వద్ద శనివారం  ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కొత్తపాలెం గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద సాయిమందిర కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు పూజల్లో పాల్గొని బాబాకు హారతి పూజలు నిర్వహించారు. సాయినాథునికి కాగడహరతి, అభిషేకం, సుప్రభాతము, ఉచిత సామూహిక స్నాతులు, సత్యంగములు, మద్యాహ్న హరతి  నిర్వహించారు. వైసీపీ మండల ఇన్‌చార్జ్‌ మద్దిశెట్టి రవీంధ్ర సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో  దర్శి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఐ.వేణుగోపాల్‌రెడ్డి, వైసీపీ జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్ధులు మారం వెంకటరెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు, మాజీ వైస్‌ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌లు చార్లెస్‌ సర్జన్‌, మారం ఇంద్రసేనారెడ్డి, కాలేషావలి,  వైసీపీ నేతలు యాడిక శ్రీనివాసరెడ్డి, కోట వెంకట్రామిరెడ్డి,దుద్దుకూరి శ్రీనివాసరెడ్డి, పులి కృష్ణారెడ్డి,కటకంశెట్టి శ్రీనివాసరావులు స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయకమిటీ నిర్వహకులు  భక్తులకు  భారీ అన్నదానం చేపట్టారు.

ముండ్లమూరు : మండంలోని గురు పౌర్ణమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. పసుపుగల్లులోని షిరిడీ సాయి బాబా దేవాలయం, ముండ్లమూరులోని సాయి ఆలయం, పోలవరం, నాయుడుపాలెం, మారెళ్ళ, ఈదర, వేములబండ తదితర గ్రామాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పూట బాబాను గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. 

దొనకొండ : దొనకొండ బ్రహ్మరావుపేటలోని శ్రీ సాయిబాబా ఆలయంలో  గురుపౌర్ణమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే బాబా మందిరానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దేవాలయం భక్తులతో కిటకిటలాడి సాయినామస్మరణలతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా భక్తులు అభిషేకం చేసి హరతి ఇచ్చి అష్టోత్తర శతనామావళి సాయిబాబా పారాయణం పఠించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. 

కురిచేడు : స్థానిక షిర్డి సాయిబాబా మందిరంలో శనివారం గురుపూర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే బాబాకు పంచామృత  అభిషేకాలు చేయించి పూజలు నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  సాయంత్రం స్వామి వారి పల్లకి సేవ జరిగింది. ఆలయ అర్చకులు పోతిరెడ్డిపల్లి రవికుమార్‌ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటి వారు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

పామూరు : పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శనివారం గురుపౌర్ణమి వేడుక మహోత్సవ కార్యక్రమాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుఝామున నుండి కాగడ హరతి, స్వామివారి మూలవిరాట్‌లు విశేష, ద్రవ్య, పంచామృత అభిషేకములతో పాటు బాబా మూలవిరాట్‌, బాబా సర్వదర్శన కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో సాయిబాబా దేవాలయ ట్రస్ట్‌ కమిటీ చైర్మన్‌ సోమిశెట్టి మాల్యాద్రి, ఉపాధ్యక్షుడు కోటా ప్రసాద్‌రావు, కార్యదర్శి పోతురాజు వసంతరావు, కోశాదికారి చీతిరాల రమే్‌షతో పాటు ట్రస్టు సేవకులు, భక్తులు పాల్గొన్నారు. 

వెలిగండ్ల: మండలంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామగోపాలపుం, మొగుళ్లూరు సాయిబాబా దేవాలయాల్లో వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మొగుళ్లూరు దేవాలయంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ద ప్రాదాలు అందజేశారు. 

కనిగిరి : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు పంచామృతాలతో బాబాను అభిషేకించారు. అధిక సంఖ్యలోభక్తులు పూజలు చేశారు.. కార్యక్రమంలో శాశ్వత ఉభయ దాతలు దేవకి నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ తన సతీమణి మెహబూబ్‌ ముంతాజ్‌తో కలిసి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇందుశర్మ విశేష పూజలు చేశారు.  చైర్మన్‌ గఫార్‌ దంపతులు బాబాకు పుష్పాభిషేకం, పల్లకిసేవ వైభవంగా మేళ తాళాలతో ఘనంగా ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో గాయం బలరామిరెడ్డి దంపతులు, బేరి పుల్లారెడ్డి దంపతులు, దశరధరెడ్డి దంపతులు, కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావులు పాల్గొని బాబాకు ప్రత్యేక హరతులు నిర్వహించారు. ఆలయ అద్యక్ష, కార్యదర్శులు దేవకి సుబ్రమణ్యం, పెన్నా వెంకేటశ్వర్లు, ముచ్చర్ల ధర్మారావు, వాగిచెర్ల వెంకటేశ్వర్లు, ఏసీ చెంచులు, కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. 

లింగసముద్రం, : మండలంలోని చినపవని, పెదపవని తదితర గ్రామాలలో గురుపౌర్ణమి వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. సాయిబాబాను దర్శించుకున్న భక్తులకు సాయిబాబా కమిటీ వారు అన్న వితరణ చేశారు.అలాగే పెదపవని గ్రామంలో కూడా సాయిబాబా ఆలయంలో భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Updated Date - 2021-07-25T07:01:01+05:30 IST