వైభవంగా గురుపౌర్ణమి

ABN , First Publish Date - 2021-07-25T05:44:17+05:30 IST

గురుపౌర్ణమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి.

వైభవంగా గురుపౌర్ణమి
నంద్యాల బొమ్మలసత్రం సాయిబాబా ఆలయంలో భక్తుల పూజలు

గురుపౌర్ణమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఆలయాల్లో  ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు హారతులు ఇచ్చి భక్తి భావాన్ని చాటుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి పాటలు ఆకట్టుకున్నాయి. ఆలయాల నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి. 


నంద్యాల(కల్చరల్‌), జూలై 24: నంద్యాల పట్టణంలోని నాగులకుంట రోడ్డు, బొమ్మలసత్రం, చాబోలు రోడ్డులో వెలిసిన సాయిబాబా ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలో వెలసిన అమ్మస్పటిక లింగేశ్వరాలయంలో యోగాచార్యులు అచల పరిపూర్ణానంద పాములేటి స్వామి పూజలు నిర్వహించారు. రోజా కుంటలోని నాగులకట్ట ఆలయంలో వెంకటేశ్వరుడికి పంచామృత అభిషేకాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. జంబులాపరమేశ్వరీ ఆలయం దగ్గరలోని సాయిబాబా ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అభినందించారు. 


ఆళ్లగడ్డ: పట్టణంలోని వేదనగర్‌లో వెలసిన సాయిబాబా దేవాలయంలో మూడు రోజులపాటు నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలు శనివారంతో ముగిశాయి. సాయిబాబాకు ప్రతి రోజు విశేష పూజలు, క్షీరాభిషేకం, వేదపారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 


పాణ్యం: మండలంలో షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రైల్వే గేటు సమీపంలోని షిరిడీ సాయి ఆలయంలో సామూహిక పంచామృతాభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన గల సద్గురు షిర్డీ సాయి ఆలయంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని కాకడ హారతి, సామూహిక పంచామృతాభిషేకం, హోమాలు నిర్వహించారు. కొనిదేడులోని సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  


శిరివెళ్ల: శిరివెళ్ల మెట్ట, వీరారెడ్డిపల్లె, వెంకటాపురం తదితర గ్రామాల్లోని సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యర్రగుంట్లలోని రామకృష్ణానంద గీతాశ్రమంలో గీతాపారాయణం చేశారు. సాయినాథుడిని శోభాయమానంగా అలంకరించారు. సాయంత్రం గ్రామాల్లో సాయిబాబా ఉత్సవమూర్తికి గ్రామోత్సవం నిర్వహించారు. 


చాగలమర్రి: చాగలమర్రిలోని సాయిబాబా ఆలయంలో శనివారం గురుపౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. వేద పండితుడు పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో జల, క్షీరాభిషేకాలు చేశారు. మహిళలు ప్రత్యేక హారతులిచ్చారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, సుబ్బారావు, నాగభూషణం, రఘురామ్‌, వినయ్‌కుమార్‌, రమణ, మహిళలు పాల్గొన్నారు. 


ఓర్వకల్లు: సోమయాజులపల్లె బస్టాండు సమీపాన ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఓర్వకల్లు, కన్నమడకల, హుశేనాపురం, సోమయాజులపల్లె, పాలకొలను, కొమరోలు, వెంకటాపురం, చెన్నంచెట్టిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ తదితర గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చారు. భజన బృందం పాడిన భక్తి పాటలను భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు అవింత్‌శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. 


రుద్రవరం: రుద్రవరంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయం లో శనివారం శేషయ్యశర్మ, శేషఫణిశర్మ, విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు చేపట్టారు. కమిటీ నిర్వాహకులు వీరయ్య, నల్లగట్ల వెంకటేశ్వర్లు, స్టాంపు నరసింహులు, గోపాల్‌రావు, నుగ్గు రాము పాల్గొన్నారు.


గడివేముల: మండలంలోని చిందుకూరు, గడివేముల గ్రామాల్లోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు పూజలు చేశారు. దుర్వేసి బాట వద్ద ఉన్న కాశీరెడ్డినాయన ఆలయంలో ద్వారం రామసుబ్బారెడ్డి, హైమవతి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. 



Updated Date - 2021-07-25T05:44:17+05:30 IST