ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

Jul 25 2021 @ 00:31AM
ఆలయంలో హారతి ఇస్తున్న మంత్రి, కలెక్టర్‌

నిర్మల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయంలో మూడురోజులుగా జరుగుతున్న గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. శనివారం గురుపౌర్ణమిని పురస్కరించుకొని ఉద యం అభిషేకం, అర్చన, హారతి కార్యక్రమాలు జరిపారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేకపూజలు చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేకపూజలు జరిపారు. ఆలయం వద్ద కొనసాగుతున్న 48 గంటల సాయినామ సంకీర్తన ముగిసింది. ఆల యానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు. ఆలయ ప్రాంగణం సాయినామ స్మరణతో మారుమోగింది. అనం తరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, నాయకులు రాంకిషన్‌రెడ్డి, ముత్యంరెడ్డి, సభ్యులు కందు ల పండరి, లక్ష్మణ్‌, గోపాల్‌రెడ్డి, కొరిపెల్లి దేవేందర్‌రెడ్డి, గోవర్ధన్‌, ఆమెడ శ్రీధర్‌, వేణుగోపాల్‌, నరహరి, శ్రీను, తదితరులు ఉన్నారు. 

Follow Us on: