భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T06:35:12+05:30 IST

పట్టణంలోని షిర్డీసాయి బాబా ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

ధర్మవరం, జూలై 24: పట్టణంలోని షిర్డీసాయి బాబా ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహించారు. సాయినగర్‌, కొత్త పేట, సిద్దయ్యగుట్ట, పోతుకుంట ప్రాంతాల్లోని షిర్టీ సాయిబాబా ఆలయాలలో అర్చకులు బాబా విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ బాబా దర్శనం చేసుకున్నారు. అనంత రం సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు.

రమణమహర్షి ఆశ్రమంలో..

పట్టణంలోని మార్కెట్‌యార్డ్‌లో సమీపంలోని సైదం వారి తోటలో ఉన్న శ్రీరమణ మహర్షి ఆశ్రమంలో శని వారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఆశ్ర మట్రస్టు వ్యవస్థాపకుడు చిప్పల వెంకప్ప ఆధ్వర్యం లో రమణమహర్షి చిత్రపటానికి తదితర పూజా కార్య క్రమా లను నిర్వహించారు. గురుపౌర్ణమిసందర్భంగా అరు ణా ల అఖండజ్యోతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అ రుణాల శివ శ్లోకాన్నీ స్పరించుకుంటూ భక్తులు పూ జలు చేశారు. అనంతరం అరిగెల పోతన్న జ్ఞాపకార్థం కు మా రులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టారు.

కదిరిఅర్బన: పట్టణంలోని వాణీ వీధిలో వెలసిన షిర్డీసాయిబాబా ఆలయంలో శనివారం గురుపౌర్ణమి వే డుకలు వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా హిందూ పురం రోడ్డు, కోనేరు వద్దగల షిర్డీసాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద యం సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు , ప్రత్యేక అలం కరణలు చేశారు. భక్తులు షిర్డిసాయిబాబాను దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేసి, గురుపౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరిం చారు. 

Updated Date - 2021-07-25T06:35:12+05:30 IST