గురువారెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2021-06-17T06:01:13+05:30 IST

సిద్దిపేట ప్రథమ శాసన సభ్యులు, స్వాతంత్య్ర సమరయోధుడు ఎడ్ల గురువరెడ్డి ఆదర్శ జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, వైస్‌ చైర్మన్‌ కనకరాజు తెలిపారు.

గురువారెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి
సిద్దిపేటలోని గురువారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

సిద్దిపేట మొదటి శాసనసభ్యుడి వర్ధంతి సభలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

సిద్దిపేట/సిద్దిపేట ఎడ్యుకేషన్‌ జూన్‌ 16: సిద్దిపేట ప్రథమ శాసన సభ్యులు, స్వాతంత్య్ర సమరయోధుడు ఎడ్ల గురువరెడ్డి ఆదర్శ జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, వైస్‌ చైర్మన్‌ కనకరాజు తెలిపారు.  బుధవారం గురువారెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గురువారెడ్డి దళ సభ్యుడిగా, కొరియర్‌గా మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాతంలో పనిచేసి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచారని చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన అట్టడుగు వర్గాల ప్రజానీకం కోసం అభిన్నతి కోసం నిరంతరం పనిచేశారన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి హైదరాబాద్‌ సిటీ కాలేజీలో ప్రభుత్వ లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలోనే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గురువారెడ్డి సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందరన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపనలో ఆయన కృషి మరువరానిదన్నారు. ఆయన తుదిశ్వాస ఉన్నంత వరకు నిరాడంబరమైన జీవితాన్ని గడిపి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సీపీఐ పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణానికి విశేష కృషి చేశారని అన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ సభ్యుడు ఎడ్ల వెంకట్రాంరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిష్టపురం లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి బన్సీలాల్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పిట్ల మల్లేశం, కర్నాల చంద్రం, భిక్షపతి, పట్టణ నాయకులు శ్రీనివాస్‌, మహేందర్‌, నర్సింహులుఉన్నారు. కాగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఆయన విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, ఏడో వార్డు కౌన్సిలర్‌ ముత్యాల శ్రీదేవి, ఎడ్ల వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు.

సిద్దిపేట అర్బన్‌: ఎడ్ల గురువరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలో ఆయన విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ సభ్యుడు ఎడ్ల వెంకట్రామ్‌ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిష్టపురం లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి బన్సీలాల్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పిట్ల మల్లేశం ,కర్నాల చంద్రం, భిక్షపతి, పట్టణ నాయకులు శ్రీనివాస్‌, మహేందర్‌, నర్సింహులు, ఐలయ్య తదితరులు నివాళులర్పించారు.

కోహెడ:   కోహెడలో సీపీఐ ఆధ్వర్యంలో సిద్దిపేట మొట్టమొదటి శాసనసభ్యుడు ఎడ్ల గురువారెడ్డి చిత్రపటానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు వేల్పుల బాలమల్లు, జిల్లా నాయకులు కనుకుంట్ల శంకర్‌, మండల కార్యదర్శి ననువాల ప్రతా్‌పరెడ్డి, సహయ కార్యదర్శులు బోనగిరి శంకర్‌, పెరుగు సురేందర్‌, మంద సురేష్‌, బండారు లక్ష్మణ్‌, ముంజ గోపి, మల్లయ్య, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల శేఖర్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. 


Updated Date - 2021-06-17T06:01:13+05:30 IST