రూ.86 వేల విలువైన గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-04-24T04:53:44+05:30 IST

రూ.86 వేల విలువైన గుట్కా పట్టివేత

రూ.86 వేల విలువైన గుట్కా పట్టివేత
స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు, నిందితుడితో ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, పోలీసు సిబ్బంది

వికారాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : అక్రమంగా నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న వ్యాపారి గుట్టును వికారాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. వికారాబాద్‌ పట్టణంలో టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ రోడ్డులో రాజేశ్‌ అనే వ్యాపారి తన దుకాణంలో గుట్కా విక్రయిస్తున్నట్లు శుక్రవారం సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.86 వేల విలువ కలిగిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ కోటేశ్వరరావు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:53:44+05:30 IST