గుట్టుగా గుట్కా దందా

ABN , First Publish Date - 2020-10-04T10:21:33+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గుట్కా అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. నిజా మాబాద్‌, కామారెడ్డి

గుట్టుగా గుట్కా దందా

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జోరుగా గుట్కా అక్రమ వ్యాపారం

గుట్టు చప్పుడు కాకుండా దుకాణాలు, పాన్‌ షాపుల్లో విక్రయాలు

రూ. లక్షలు దండుకుంటున్న అక్రమార్కులు, వ్యాపారులు 

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి దిగుమతి 

పోలీసులు దాడులు చేసినా ఆగని అక్రమ రవాణా

గుట్కా వ్యాపారులపై కఠినమైన కేసులు లేకపోవడమే కారణమా?

పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న ఉమ్మడి జిల్లా ప్రజలు


బాన్సువాడ, అక్టోబరు 3 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గుట్కా అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. నిజా మాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల దాటి రాష్ట్రమంతా  సరఫరా అవుతోంది. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో గుట్కా వ్యాపా రాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశాలు జారీ చేయగా.. కొం త కాలం పోలీసులు తనిఖీలు చేపట్టి గుట్కా దందా కొనసా గిస్తున్న వ్యక్తులతో పాటు రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసు లు నమోదు చేయగా.. కొద్దిరోజులు మాత్రమే నియంత్రణ కొనసాగింది. ఆ తర్వాత గుట్కా వ్యాపారులు మళ్లీ తమ దందాను యథావిఽధిగా కొనసాగిస్తున్నారు. కొంత కాలం క్రి తం కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి ప్రత్యేక పోలీస్‌ సిబ్బందితో దాడులు చేయించి జిల్లాలో గుట్కా విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో గుట్కా వ్యాపారులు సరిహద్దు ప్రా ంతాలను తమ అడ్డాలుగా మార్చుకున్నారు. ఔరాద్‌, బీదర్‌, నారాయణఖేడ్‌, దెగ్లూర్‌ ప్రాంతాల్లో గుట్కా స్థావరాలను ఏ ర్పాటు చేసుకొని అక్కడి నుంచి గుట్కా రవాణా చేస్తున్నా రు. బస్సులు, టాటా మ్యాజిక్‌ ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహ నాలపై పోలీసుల కంటపడకుండా బిచ్కుంద, పిట్లం, మ ద్నూర్‌, జుక్కల్‌, బాన్సువాడ పట్టణం మీదుగా నిజామాబా ద్‌ జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో పో లీసులు ఎన్ని దాడులు చేసినప్పటికీ అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఉభయ జిల్లాల్లోని దుకాణాలు, పాన్‌ షాపుల్లో గుట్కాను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. 


గుట్కా కేంద్రంగా మారిన బిచ్కుంద

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద నుంచి అక్రమ మార్గం ఎంచు కున్న వ్యాపారులు ఔరాద్‌, కర్ణాటక రాష్ర్టాల నుంచి సరఫ రా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జుక్కల్‌ నియోజకవ ర్గంలోని బిచ్కుంద మండల కేంద్రం గుట్కాకు కేంద్రంగా మారింది. అంతేకాకుండా పిట్లం మండల కేంద్రంలో కూడా గుట్కాను నిల్వ చేస్తున్నారు. గతంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన తనిఖీల్లో బిచ్కుంద వాసులే గుట్కా దం దాను కొనసాగిస్తూ పట్టుబడ్డారు. 


కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజన్‌లో జుక్కల్‌, మ ద్నూర్‌, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌, పిట్లం, నిజాంసాగర్‌, బీ ర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ మండలాల్లో గుట్కా వ్యా పారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో బాన్సువాడ పట్టణంలోని డెయిలీ మార్కెట్‌ వద్ద ఒకరి ఇంట్లో నిల్వ ఉన్న గుట్కా ప్యాకెట్లను, తంబాకు, పాన్‌ మసాలాను పోలీసులు పట్టుకొని సీజ్‌ చేశారు. అదేవిధంగా మద్నూర్‌, బిచ్కుంద మండల కేంద్రాల్లో పోలీసులు తనిఖీ లు నిర్వహించి ఆటోల్లో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ప ట్టుకుని సీజ్‌ చేశారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎన్ని తనిఖీ లు చేపట్టినా ఈ దందా మాత్రం గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు. 


అధిక ధరలకు విక్రయాలు

ధనార్జనే ధ్యేయంగా ఈ దందాను కొనసాగిస్తున్న అక్ర మార్కులు ఒక్కో గుట్కా ప్యాకెట్‌పై రూ.7 నుంచి రూ.10 వరకు అధికంగా వసూలు చేస్తూ సొమ్ముచేసుకుంటున్నా రు. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘాపెట్టి దాడులు చేపడితే తప్ప ఉభయ జిల్లాల్లో యథే చ్ఛగా కొనసాగుతున్న ఈ అక్రమ గుట్కా దందాకు అడ్డుక ట్ట పడదని పలువురు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పోలీసులు గుట్కా స్థావ రాలైన గోదాంలు, దుకాణాలపై తరచూ దాడులు చేపడుతు న్న నేపథ్యంలో వ్యాపారులు గుట్కా స్థావరాలను మహారా ష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన జుక్కల్‌, మద్నూర్‌, బి చ్కుంద, పిట్లం శివారులకు తరలించి అక్కడి నుంచి రాత్రివే ళల్లో, తెల్లవారుజామున గుట్కాను యథేచ్ఛగా రవాణా చే స్తున్నారు. పోలీస్‌ శాఖలో ఎన్నో కేసులకు కఠిన శిక్షలున్నా యని, సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కా వ్యా పార అక్రమార్కులపై కఠిన శిక్షలు లేకపోవడంతో వారు నిర్భయంగా ఈ దందాను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.


వ్యాపారులు ఎన్నిసార్లు దొరికినా తూతూ మంత్రంగా కేసు లు నమోదు చేసి వదిలి వేయడమే జరుగుతోంది. వారిని శిక్షించాల్సిన సెక్షన్లు కానీ, చర్యలు కానీ తమ చేతిలో ఏమి లేవంటూ పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు. దాడులు చేపట్టి.. ఆ సమయంలో దొరికిన వ్యాపారులను, గుట్కా ని ల్వను ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌కు అప్పజెప్పడమే పోలీస్‌ బాధ్యత అని, ఆపై తమకు ఎలాంటి అధికారాలు లేవని పోలీస్‌ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధి కారులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న గుట్కాను నియంత్రించి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘాపెట్టి గుట్కా అక్రమ  రవా ణా జరగకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-10-04T10:21:33+05:30 IST