Railway ladies coachలలో పురుషులు ఎక్కుతున్నారా? అయితే జాగ్రత్త...ఆర్పీఎఫ్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-06-03T15:33:24+05:30 IST

అబ్బాయిలూ రైల్వే లేడీస్ కోచ్‌లలో ఎక్కుతున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు రైల్వే పోలీస్ ఫోర్స్ మహిళా సిబ్బంది....

Railway ladies coachలలో పురుషులు ఎక్కుతున్నారా? అయితే జాగ్రత్త...ఆర్పీఎఫ్ హెచ్చరిక

న్యూఢిల్లీ: అబ్బాయిలూ రైల్వే లేడీస్ కోచ్‌లలో ఎక్కుతున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు రైల్వే పోలీస్ ఫోర్స్ మహిళా సిబ్బంది. మహిళల బోగీల్లో అక్రమంగా ప్రయాణిస్తున్న 7,000 మంది యువకులను తాజాగా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.శిక్షణ పొందిన మహిళా అధికారులు, సిబ్బందితో కూడిన 283 బృందాలు 223 రైల్వే స్టేషన్‌లను మోహరించి తనిఖీలు జరుపుతున్నాయి. 1,125 మంది మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందిని భారతీయ రైల్వేలో నియమించారు.లేడీస్ కోచ్‌లలో అక్రమంగా ప్రయాణించినందుకు ఒక నెల వ్యవధిలో 7,000 మంది పురుషులను మహిళా పోలీసులు అరెస్టు చేశారు.ఆపరేషన్ మహిళా సురక్ష కింద మే 3 నుంచి మే 31వతేదీల మధ్య ఈ డ్రైవ్‌ను ఆర్పీఎఫ్ ప్రారంభించింది. 


రైల్వే నిబంధనల ప్రకారం పురుషులు మహిళల కోసం ప్రత్యేక కోచ్‌లలో ప్రయాణించకూడదు. ఇది శిక్షార్హమైన నేరం. రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు మెరుగైన భద్రత కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘మేరీ సహేలి’ కార్యక్రమం కూడా అమలులో ఉంది.ఈ కాలంలో మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు ఎస్కార్ట్ విధులు చేపట్టారు.  ఈ నెల రోజుల ఆపరేషన్‌లో ఆర్పీఎఫ్ సిబ్బంది జారి పడిన 10 మంది మహిళల ప్రాణాలను కాపాడారు. 


Updated Date - 2022-06-03T15:33:24+05:30 IST