ఎన్నికలెప్పుడు వచ్చినా టీడీపీ విజయం ఖాయం

Sep 21 2021 @ 00:41AM
జీవీ ఆంజనేయులు

జీవీ ఆంజనేయులు

 గుంటూరు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం తథ్యమని నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఆనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ బహిష్కరించిన స్థానిక ఎన్నికల ఫలితాలు చూసి తామేదో ఘనవిజయం సాధించామని వైసీపీ నేతలు గప్పాలు పోవటం హాస్యాస్పదమన్నారు. ఓ వైపు ప్రజలు చీత్కరిస్తున్నా... సిగ్గులేకుండా వైసీపీ నేతలు గెలిచామంటూ సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయనే పత్రికలపై సీఎం జగన విషం కక్కుతున్నారన్నారు. రాషా్ట్రభివృద్ధిని గాలికొదిలేసిన జగనను వందమంది పీకేలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో కాపాడలేరని తెలిపారు.  సీఎం అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని.. అందులో భాగంగానే దాడి చేసిన వారిని వదిలి తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. అరాచకాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.