జీవి ప్రకాశ్ ‘ఇడిముళక్కం’ చిత్రీకరణ పూర్తి

Sep 19 2021 @ 13:41PM

కోలీవుడ్ యంగ్ స్టార్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇడి ముళక్కం’ (ఉరుము).  తమిళంలో వైవిధ్యమైన చిత్రాల్ని తెరెకెక్కించడంలో చెయితిరిగిన దర్శకుడు శ్రీను రామస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఆగష్ట్ 1 న ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా.. తేనీ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా రూపొందడం విశేషం. 

అతి తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి హీరో జీవి ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ..  ‘ఇడిముళక్కం’ సినిమా షూటింగ్ ను విజయవంతగా పూర్తి చేశాం. తిరునాళ్ళు ముగిసిన తర్వాత విద్యార్ధులు ఏవిధంగా పాఠశాలకు వెళతారో.. ఆ విధంగా నేను కూడా ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే చెన్నైకి బైలుదేరి వెళుతున్నాను. జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాల్ని అందించిన దర్శకుడు శ్రీను రామస్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.