AP: ఎమ్మెల్యేల ఖాతాల నుంచి డబ్బులు తీసుకోరేం?: GVL

ABN , First Publish Date - 2022-07-01T16:38:42+05:30 IST

ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి రూ. 800 కోట్ల మాయంపై బీజేపీ నేత జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP: ఎమ్మెల్యేల ఖాతాల నుంచి డబ్బులు తీసుకోరేం?: GVL

విశాఖ (Visakha): లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) ఖాతా నుంచి రూ. 800 కోట్ల మాయంపై బీజేపీ నేత జీవీఎల్ (GVL) నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒకసారి పంచాయతీ ఖాతాల్లోంచి డబ్బు తీసుకున్నారని, ఇప్పుడు ఉద్యోగుల అకౌంట్లలో జమ చేసిన డబ్బు డ్రా చేశారని విమర్శించారు. ప్రశ్నిస్తే టెక్నికల్ సమస్య అని చెబుతున్నారని.. ఎమ్మెల్యేల ఖాతాల నుంచి డబ్బులు ఎందుకు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు, చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పంచాయతీ రాజ్ సంస్థల్లో డబ్బులను ప్రభుత్వం తీసుకుని, టెక్నికల్ సమస్య అంటూ దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులు, పంచాయతీ రాజ్ సంస్థల నుంచి కాజేసిన సొమ్మును వెంటనే ఆయా ఖాతాల్లో జమ చేసి వారికి ధైర్యాన్ని నింపాలన్నారు.


కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయని, ఈ కార్యక్రామానికి బీజేసీ అతిరథమహారధులందరూ వస్తున్నారని జీవీఎల్ తెలిపారు. రెండు దశాబ్దాల తర్వాత జరిగే ఈ జాతీయ కార్యవర్గం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ప్రధాని మోదీ భీమవరం పర్యటనకు వస్తున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా అల్లూరి విగ్రహానని ప్రధాని ఆవిష్కరిస్తారని జీవీఎల్ తెలిపారు.

Updated Date - 2022-07-01T16:38:42+05:30 IST