నూతన పన్ను విధానంపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2020-12-03T05:35:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పరిధిలో అమల్లోకి రానున్న నూతన ఆస్తిపన్ను విధానంపై వార్డు పరిపాలనా కార్యదర్శి మొదలు రెవెన్యూ సిబ్బంది వరకు అంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని జీవీఎంసీ కమిషనర్‌ సృజన సూచించారు.

నూతన పన్ను విధానంపై అవగాహన ఉండాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ సృజన

అధికారులకు గ్రేటర్‌ కమిషనర్‌ సూచన

సిరిపురం, డిసెంబరు 2: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పరిధిలో అమల్లోకి రానున్న నూతన ఆస్తిపన్ను విధానంపై వార్డు పరిపాలనా కార్యదర్శి మొదలు రెవెన్యూ సిబ్బంది వరకు అంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని జీవీఎంసీ కమిషనర్‌ సృజన సూచించారు. బుధవారం సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో గ్రేటర్‌ ప్రధాన అధికారులు, రెవెన్యూ విభాగం, వార్డు కార్యదర్శులతో నూతన పన్ను విధానంపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో ఒకే విధమైన పన్ను విధానం అమలులో భాగంగా తెస్తున్న నూతన విధానం వల్ల ప్రజలపై అదనపు భారం ఉండదన్నారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల, సంస్కరణల అమలుకు నూతన ఆస్తి పన్ను విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు సూచనలు జారీ చేసిందని తెలిపారు. అందువల్ల ముందు అధికారులు ఈ విధానంపై పూర్తి అవగాహన కలిగి వుంటే ప్రజలకు వివరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ ఆశాజ్యోతి, సీపీఏ విద్యుల్లత, సీఎంఓహెచ్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్ర్తి, పర్యవేక్షక ఇంజనీరు రాజారావు, డీసీఆర్‌ రమేష్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్లు, నీటి, రెవెన్యూ అధికారులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:35:56+05:30 IST