జీవీఎంసీ ఎన్నికల సిబ్బంది ఆందోళన

ABN , First Publish Date - 2021-03-02T06:35:29+05:30 IST

ఉపాధ్యాయులను కించపరిచే విధంగా మండల పరిషత్‌ కార్యాలయం పరిపాలనాధికారి (ఏవో) మూర్తి మాటా ్లడారంటూ ఎన్నికల విధులకు నియామకమైన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.

జీవీఎంసీ ఎన్నికల సిబ్బంది ఆందోళన

 మండల పరిషత్‌ కార్యాలయ ఏవో కించపర్చేలా  మాట్లాడారని ఆరోపణ

శిక్షణను రెండు గంటల పాటు బహిష్కరణ

 ఏవో మూర్తి క్షమాపణ చెప్పడంతో సమస్య పరిష్కారం


మాకవరపాలెం, మార్చి 1 : ఉపాధ్యాయులను కించపరిచే విధంగా  మండల పరిషత్‌ కార్యాలయం పరిపాలనాధికారి (ఏవో) మూర్తి మాటా ్లడారంటూ  ఎన్నికల విధులకు నియామకమైన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఏవో, ఏపీవోలుగా నియ మితులైన ఉపాధ్యాయులకు సోమవారం ఇక్కడి స్త్రీశక్తి భవనంలో శిక్షణ శిబిరం ఏర్పాటైంది. ఈ శిబిరానికి ఎంపీడీవో అరుణశ్రీ హాజరు కావలసి ఉండగా, మండల పరిషత్‌ ఏవో మూర్తి విచ్చేశారు. సమావేశం జరుగు తుండగా, జి.కోడూరుకు చెందిన ఉపాధ్యాయిని సెల్‌ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌ను చూస్తుండగా, ఏవో ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమెను బయటకు పొమ్మని ఆదేశించడంతో ఉపాధ్యాయులకు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉపాధ్యాయులంతా శిక్షణను బహిష్కరించి, సుమారు రెండు గంటల పాటు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీవో అరుణశ్రీ అక్కడికి చేరుకొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. దీంతో ఇరువర్గాల మధ్య మళ్లీ కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు ఏవో మూర్తి క్షమాపణ చెప్పడంతో శిక్షణ కొనసాగింది. 

Updated Date - 2021-03-02T06:35:29+05:30 IST