గాజువాకలో ఈదురు గాలులు

ABN , First Publish Date - 2021-04-24T05:13:36+05:30 IST

గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఈదురు గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దుమ్ము, ధూళితో కూడిన గాలులు శుక్రవారం మధ్యాహ్నం వీచాయి.

గాజువాకలో ఈదురు గాలులు
వినాయకనగర్‌ వుడా కాలనీలో రేగిన దుమ్ము

గాజువాక, ఏప్రిల్‌ 23: గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఈదురు గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దుమ్ము, ధూళితో కూడిన గాలులు శుక్రవారం మధ్యాహ్నం వీచాయి. వినాయకనగర్‌ వుడా కాలనీలో దట్టమైన దుమ్ము, ధూళి కారణంగా రహదారిపై రాకపోకలు సాగించే వారు ఒకరినొకరు కనిపించలేని పరిస్థితి నెలకొంది. సుమారు గంట సమయం పాటు వీచిన ఈ గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ గాలుల వలన ఎటువంటి అంవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 


Updated Date - 2021-04-24T05:13:36+05:30 IST