నేడు డివిజన్ల పునర్విభజన ముసాయిదా

ABN , First Publish Date - 2021-03-07T05:06:10+05:30 IST

నేడు డివిజన్ల పునర్విభజన ముసాయిదా

నేడు డివిజన్ల పునర్విభజన ముసాయిదా

వరంగల్‌ సిటీ, మార్చి 6: జీడబ్ల్యూఎంసీ పరిధిలోని డివిజన్ల పునర్విభజన ముసాయిదా ఆదివారం విడుదల కానుంది. షెడ్యూల్‌ మేరకు విడుదల కానున్న ముసాయిదాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పునర్విభజనలో ప్రధాన ఘట్టమైన ముసాయిదా విడుదలతో డివిజన్ల స్వరూపం తేటతెల్లం కానుంది. ప్రస్తుతం గ్రేటర్‌ వరంగల్‌లో 58 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత  డివిజన్ల సంఖ్య 66కు పెరగనుంది. ఫిబ్రవరి 23న డీలిమిటేషన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. 24 నుంచి అధికారులు కసరత్తు ఆరంభించారు. 11 రోజుల తర్వాత ముసాయిదాను ప్రకటించనున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు ఈనెల 9 నుంచి 15 వరకు నగరవాసులు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 16 నుంచి 21 వరకు అన్నింటినీ పరిశీలించి సహేతుకమైనవాటిని పరిగణనలోకి తీసుకొని మార్పులు చేస్తారు. ఈనెల 22న సీడీఎంఏకు పునర్విభజన నివేదికను సమర్పిస్తారు. రెండు రోజుల ప్రభుత్వ పరిశీలన తదుపరి మార్చి 25న పునర్విభజన ఫైనల్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుంది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 66 డివిజన్లకు అధికారిక ముద్ర పడుతుంది.


Updated Date - 2021-03-07T05:06:10+05:30 IST