Gyanvapi Masjid బావిలో శివలింగం.. ఆ ప్రాంతాన్ని Seal చేయాలని కోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2022-05-16T20:35:58+05:30 IST

కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు లోపల శివలింగం బయటపడిన ప్రాంతాన్ని..

Gyanvapi Masjid బావిలో శివలింగం.. ఆ ప్రాంతాన్ని  Seal చేయాలని కోర్టు ఆదేశం

వారణాసి: కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi Masjid) లోపల శివలింగం (Shivling) బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేయాలని స్థానిక యంత్రాంగాన్ని వారణాసి సివిల్ కోర్టు (Local court) ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు కాంపెక్స్‌లో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే సోమవారంనాడు పూర్తయింది. ఇక్కడున్న బావిలో శివలింగం బయటపడినట్టు హిందూ అడ్వకేట్లు ప్రకటించారు. శివలింగానికి రక్షణ కల్పించాలంటూ  న్యాయవాది విష్ణు జైన్ నేరుగా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్‌కు కోర్టు తక్షణ ఆదేశాలు జారీ చేసింది. శివలింగం లభించిన ప్రాంతాన్ని వెంటనే సీల్ చేయాలని, విజిటర్ల ప్రవేశాన్ని నిషేధించాలని కోర్టు ఆదేశించింది. సీల్ చేసిన ప్రాంతానికి భద్రత కల్పించాలని వారణాసి డీఎం, పోలీస్ కమిషనర్, సీఆర్‌పీఎఫ్ కమాండంట్‌లకు ఆదేశాలిచ్చింది.


కాగా, సర్వే వర్క్‌పై అడ్వకేట్ కమిషనర్లు ఎలాంటి వివరాలను బహిర్గతం చేయనప్పటికీ తమ సర్వేలో తేలిన వివరాలను  మంగళవారంనాడు కోర్టుకు తెలియజేయనున్నట్టు చెప్పారు. సర్వేలో సమగ్ర సాక్షాలు లభ్యమైనట్టు జ్ఞానవాపి కేసులో పిటిషనర్ సోహన్ లాల్ ఆర్య తెలిపారు. ''బాబా మిల్ గయే'' అంటూ ముక్తసరి సమాధానమిచ్చారు. హిందువుల తరఫు అడ్వకేట్ మోహన్ యాదవ్ దీని పై మాట్లాడుతూ, 12 అడుగుల 8 అంగుళాల వ్యాసార్ధంలో శివలింగం ఉన్నట్టు చెప్పారు.


మసీదు ప్రాంగణంలో శని, ఆదివారాల్లో సర్వే నిర్వహించారు. నమాజుకు ముందు ముస్లింలు తమ కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే చెరువు (pond)ను సర్వే కోసం ఖాళీ చేశారు. ఆ చెరువులోనే శివలింగం దొరికినట్టు చెబుతున్నారు. జ్ఞానవాపి కాంప్లెక్‌ వెస్ట్రన్ వాల్ వద్ద హిందూ ఆలయం కూల్చివేతకు సబంధించిన అవశేషాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగో లాక్‌ను సోమవారంనాడు తెరిచారు. మొదటి మూడు గదులు శనివారంనాడు సర్వే కోసం తెరిచారు.

Updated Date - 2022-05-16T20:35:58+05:30 IST