Gyanvapi masjid ఉంది...ఎప్పటికీ ఉంటుంది: Owaisi

ABN , First Publish Date - 2022-05-16T22:31:37+05:30 IST

''జ్ఞానవాపి మసీదు ఉంది...ఎప్పటికీ ఉంటుంది'' అని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ..

Gyanvapi masjid ఉంది...ఎప్పటికీ ఉంటుంది: Owaisi

న్యూఢిల్లీ: ''జ్ఞానవాపి మసీదు (Gyanvapi masjid) ఉంది...ఎప్పటికీ ఉంటుంది'' అని ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. జ్ఞానవాపి మసీదు సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన కొద్ది గంటలకే ఒవైసీ ఓ ట్వీట్‌లో తాజా వ్యాఖ్యలు చేశారు. ట్వీ‌ట్‌తో పాటు ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. దేశంలోని ముస్లింలు బాబ్రీ మసీదును పోగొట్టుకున్నారు. కానీ వాళ్లు మరో మసీదును వదులుకోరు'' అని ఒవైసీ ఆ వీడియోలో మాట్లాడటం కనిపిస్తుంది. ''జ్ఞానవాపి మసీదు అనేది ఒక మసీదు. అది శాశ్వతంగా ఉంటుంది'' అని ఆ వీడియోకు ఆయన క్యాప్షన్ ఇచ్చారు.

Updated Date - 2022-05-16T22:31:37+05:30 IST