Gyanvapi కేసులో మసీదు కమిటీపై చర్యకు హిందూ ధర్మకర్త పిటిషన్

ABN , First Publish Date - 2022-06-06T16:52:09+05:30 IST

జ్ఞానవాపి మసీదు వివాదంపై సోమవారం మరో రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి....

Gyanvapi కేసులో మసీదు కమిటీపై చర్యకు హిందూ ధర్మకర్త పిటిషన్

వారాణసీ(ఉత్తరప్రదేశ్): జ్ఞానవాపి మసీదు వివాదంపై సోమవారం మరో రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీపై కేసు నమోదు చేయాలని, మరోకటి మసీదు ప్రాంగణంలోని శివలింగాన్ని పూజించుకునేందుకు అనుమతించాలని కోరుతూ రెండు పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి.ఈ రెండు పిటిషన్లను వారాణసీ కోర్టు సోమవారం విచారించనుంది.అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ జాయింట్ సెక్రటరీ,వందలాది మంది మసీదు కమిటీ వ్యక్తులపై సీఆర్‌పీసీ 156(3) కింద కేసు నమోదు చేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్ ను ప్రత్యేక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమర్థమ నగేష్ వర్మ విచారించనున్నారు.శృంగర్ గౌరీ-జ్ఞాన వాపి మసీదు కేసులో హిందూ న్యాయవాదులు మసీదు ప్రాంగణంలో సర్వే చేయగా వాజుఖానాలో శివలింగం ఉందని చెప్పారు. 


కాగా వజూఖానాలో ఉన్నది ఫౌంటేన్ అని మసీదు కమిటీ అంటోంది.జ్ఞానవాపి మసీదులోని శివలింగం ముందు ప్రార్థనలు చేయాలంటూ స్వామి అవిముక్తేశ్వరానంద్ వేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించనుంది. కోర్టుకు వేసవి సెలవులు కావడంతో సెలవుల బెంచ్‌ను విచారణకు ఆదేశించింది.కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని శృంగార్ గౌరీ స్థలానికి రోజువారీ పూజకు అనుమతి కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు చేసిన అభ్యర్థనపై జిల్లా కోర్టు కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసులో తదుపరి విచారణ జులై 4న జరగనుంది.


Updated Date - 2022-06-06T16:52:09+05:30 IST