బాడీ పెరుగుతుందంటూ యువకుడికి ఇంజెక్షన్ చేసిన జిమ్ ట్రైనర్.. ఆ యువకుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకుంటే..
ABN , First Publish Date - 2022-03-14T17:45:43+05:30 IST
ఆ యువకుడు రెండు నెలల క్రితం జిమ్‌లో జాయిన్ అయ్యాడు.. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాడు..
ఆ యువకుడు రెండు నెలల క్రితం జిమ్‌లో జాయిన్ అయ్యాడు.. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాడు.. అయినా అతను అనుకున్న విధంగా బాడీ షేప్ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.. దీంతో జిమ్ ట్రైనర్ ఇటీవల అతనికి ఓ ఇంజెక్షన్ చేశాడు.. రెండ్రోజుల అనంతరం ఆ యువకుడికి యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైంది.. ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెక్ చేయించుకుంటే అసలు విషయం బయటపడింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అనూప్ నగర్‌కు చెందిన ఇజాజ్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం స్థానికంగా ఓ జిమ్‌లో జాయిన్ అయ్యాడు. స్టామినా పెరుగుతుందని, బాడీ షేప్ వస్తుందని చెబుతూ జిమ్ ట్రైనర్ అతనికి వారం రోజుల క్రితం ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ చేయించుకున్న వారం రోజులకు ఇజాజ్‌కు పురుషాంగంలో మంట మొదలైంది. టాయిలెట్‌కు వెళ్లే సమయంలో నొప్పి భరించలేకపోయేవాడు.
దీంతో అతను ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహించే డాక్టర్ వద్దకు వెళ్లి టెస్ట్ చేయించుకున్నాడు. జిమ్ ట్రైనర్ ఇచ్చిన ఇంజక్షన్ వల్ల తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, దానిని భారత్‌లో నిషేధించారని తేలింది. దీంతో ఈ యువకుడు జిమ్ ట్రైనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ జిమ్‌పై పోలీసులు ఆదివారం దాడి చేశారు. అక్కడ అలాంటి ఎన్నో నిషేధిత ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు జిమ్ ట్రైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.