ఆ విషయంలో హెచ్-1బీ వీసాదారులే టాప్..!

ABN , First Publish Date - 2022-04-13T02:21:47+05:30 IST

అమెరికాలో అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగుల్లో హెచ్-1బీ వీసాదారులే ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలో అత్యధిక సంపాదన ఉన్న పది శాతం ఉద్యోగుల్లో హెచ్-1బీ వీసాదారులు ఉన్నట్టు అమెరికా సంస్థ కాటో ఇన్‌స్టిట్యూట్ తన తాజా అధ్యయనంలో పేర్కొంది.

ఆ విషయంలో హెచ్-1బీ వీసాదారులే టాప్..!

ఎన్నారై డెస్క్: అమెరికాలో అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగుల్లో హెచ్-1బీ వీసాదారులూ ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలో అత్యధిక సంపాదన ఉన్న తొలి పది శాతం మంది ఉద్యోగుల్లో హెచ్-1బీ వీసాదారులు ఉన్నట్టు అమెరికా సంస్థ కాటో ఇన్‌స్టిట్యూట్ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ లెక్కల ప్రకారం..  2021లో హెచ్-1బీ వీసాదారుల సగటు ఆదాయం 108,000 డాలర్లు. అదే సమయంలో.. అమెరికాలోని మొత్తం ఉద్యోగుల సగటు వేతనం 45,760 డాలర్లు. అంటే..హెచ్-1బీ వీసాలున్న వారి సగటు రెండు రెట్లన్న కంటే అధికమన్న మాట. 


అంతేకాకుండా.. హెచ్-1బీ వీసాదారుల జీతాల్లో వృద్ధి కూడా ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. 2003-21 మధ్య కాలంలో హెచ్-1బీ వీసాలున్న వారి ఆదాయం సగటున 53 శాతం పెరగ్గా.. అమెరికాలోని మొత్తం కార్మికుల సగటు ఆదాయం కేవలం 39 శాతం మేర పెరిగింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ 2003లో వేతనాల లెక్కలను సేకరించడం ప్రారంభించిన నాటి నుంచి.. హెచ్-1బీ వీసాదారుల జీతనాతాలు మిగిలిన 90 శాతం మంది అమెరికా ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉన్నట్టు తేలడం ఇదే తొలిసారి. ఇక.. ఈ వీసా చేజిక్కించుకుంటున్న వారిలో అత్యధికులు భారతీయులేనన్న విషయం తెలసిందే. 

Updated Date - 2022-04-13T02:21:47+05:30 IST