వ్యాక్సినేషన్ ఆన్‌లైన్ సర్వర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు

ABN , First Publish Date - 2021-08-03T07:42:33+05:30 IST

కరోనా మహమ్మారి సృష్టించిన కలకలం కొద్దిగా సద్దుమణిగింది అనుకునేలోపే డెల్టా వేరియంట్ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టింది.

వ్యాక్సినేషన్ ఆన్‌లైన్ సర్వర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు

రోమ్: కరోనా మహమ్మారి సృష్టించిన కలకలం కొద్దిగా సద్దుమణిగింది అనుకునేలోపే డెల్టా వేరియంట్ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కరోనా నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని అంటున్నాయి. ప్రజల్లో ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోయి ఉంటే వెంటనే తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు హ్యాకర్లు.. వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సర్వర్లను హ్యాక్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఇటలీలోని లాజియో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోమ్ చుట్టుపక్కల, లాజియో ప్రాంతంలో వ్యాక్సిన్ తీసుకోవడం కోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుంటారు. ఇలా చేసుకునే సర్వర్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు దాన్ని షట్‌డౌన్ చేశారు. ‘‘ఇది చాలా బలమైన హ్యాకర్ దాడి. చాలా తీవ్రమైంది’’ అని ఒక అధికారి చెప్పారు. కాగా, ఈ ప్రాంతంలో సుమారు 70శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-03T07:42:33+05:30 IST