హఫీజ్‌ సయీద్‌కు 31ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2022-04-09T08:39:04+05:30 IST

ఉగ్రసంస్థ లష్కరే తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌(70)కు పాకిస్థాన్‌ యాంటీ-టెర్రరిజం కోర్టు తాజాగా 31ఏళ్ల జైలు శిక్ష విధించింది.

హఫీజ్‌ సయీద్‌కు 31ఏళ్ల జైలు

పాక్‌ యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: ఉగ్రసంస్థ లష్కరే తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌(70)కు పాకిస్థాన్‌ యాంటీ-టెర్రరిజం కోర్టు తాజాగా 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడన్న ఆరోపణలపై నమోదైన రెండు కేసుల్లో అతడిని దోషి గా తేల్చిన కోర్టు, జైలు శిక్షతో పాటు సుమారు రూ. 1.38 లక్షల జరిమానాను కూడా విధించింది. మరో 5 కేసుల్లో హఫీజ్‌కు ఇప్పటికే ఉన్న జైలు శిక్షను కలుపుకొంటే.. మొత్తం 68ఏళ్ల జైలు శిక్షను అతడు అనుభవించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. సయీద్‌ లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పట్‌ జైలులో ఉన్నాడని.. అక్కడి నుంచే అతడిని కోర్టుకు తరలించామని అధికారులు తెలిపారు. 2008లో ముంబైపై జరిగిన దారుణ ఉగ్రదాడుల్లో హఫీజ్‌ కీలక సూత్రధారి. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తించిన అమెరికా, అతడి తలపై రూ.76 కోట్ల బహుమతిని ప్రకటించింది.ు. 

Updated Date - 2022-04-09T08:39:04+05:30 IST