తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన

ABN , First Publish Date - 2022-01-11T02:31:25+05:30 IST

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వడగళ్ల వాన

తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన

సిద్దిపేట/వరంగల్/ఆదిలాబాద్‌/కరీంనగర్/జగిత్యాల : తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్ మండలంలోని మహామాదాపుర్, రాములపల్లి, మధద, నాగారం, ఉమ్మాపుర్ గ్రామాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. 


ఆదిలాబాద్‌ జిల్లాలోలో ..

ఆదిలాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన పడింది.  నార్నూర్ తదితర ప్రాంతాల్లో భారీగా రాళ్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. వడగళ్ల వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


వరంగల్ జిల్లాలో..

 ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. వాన రాకతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వరంగల్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. 


 కరీంనగర్ జిల్లాలో.. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక, ఇళ్లందకుంట మండలాల్లో వర్షం కురుస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం పడింది. 


మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తీవ్ర గాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షాలతో పత్తి, రైతులు ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి 132/33 కేవీ విద్యుత్ లైన్‌లో అంతరాయం. ఏర్పడింది. నెన్నెల, భీమిని,కన్నెపెళ్లి, వేమనపల్లి మండలాలకు  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

Updated Date - 2022-01-11T02:31:25+05:30 IST