వడగండ్లు కడగండ్లు

ABN , First Publish Date - 2021-04-24T05:08:04+05:30 IST

అ కాల వర్షం అన్నదాతలను ఆగం చే సింది. గురువారం అర్ధరా త్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి.

వడగండ్లు కడగండ్లు
వెల్కిచర్లలో నేలరాలిన మామిడి

- అకాల వర్షాలతో ఆగమైన అన్నదాత 

- రెండు రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న వాన 

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎక్కువగా పంట నష్టం 

- దెబ్బతిన్న వరి పైర్లు, మామిడి తోటలు

- వెల్దండ, గోపాల్‌పేట మండలాల్లో పడిన వడగండ్లు 

- జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో దుమారం రేపిన ఈదురు గాలులు 

- రోడ్లపై విరిగి పడిన భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు


(గద్వాల-ఆంధ్రజ్యోతి)/కృష్ణా/భూత్పూర్‌/గోపాల్‌పేట/కందనూలు/బిజినేపల్లి/వంగూరు/వెల్దండ/రాజోలి, ఏప్రిల్‌ 23 : అ కాల వర్షం అన్నదాతలను ఆగం చే సింది. గురువారం అర్ధరా త్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. 

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, వంగూరు, వెల్దండ మండ లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాగర్‌కర్నూల్‌ మండ లం నల్లవెల్లి గ్రామంలో 105 ఎకరాలు, తూడుకుర్తిలో 1,121 ఎ కరాలు, గుడిపల్లిలో 159 ఎకరాలు, పెద్దాపూర్‌లో 59 ఎకరాలు, బొందలపల్లిలో 420 ఎకరాలు, శ్రీపురంలో పది ఎకరాలు, అవు రాసిపల్లిలో 45 ఎకరాలు, నర్సాయిపల్లిలో 140 ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నాయి. కాగా, శుక్రవారం వ్యవసాయాధికారులు దె బ్బతిన్న పంటలను పరిశీలించారు. బిజినేపల్లి మండలంలో వ ర్షానికి పొలాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. పటు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో శుక్రవారం ఉ దయం వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వంగూరు మండల కేంద్రంతో పాటు ఉమ్మాపూర్‌, తిప్పారెడ్డిపల్లి, ఉప్పల పహాడ్‌ గ్రామాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వ ర్షానికి వరి పంటలు దెబ్బతిన్నది. ఉమ్మాపూర్‌లో వరి పైర్లు నే లకొరిగాయి. తిప్పారెడ్డిపల్లిలో చెట్టు కూలి విద్యుత్‌ వైర్లు తెగిప డటంతో కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెల్దండ మండల కేంద్రంతో పాటు పెద్దాపూర్‌, కొట్ర, కంటోనిపల్లి గ్రా మాల్లో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది. దీంతో ఈ గ్రా మాల్లో వరి పైర్లు నేలకొరిగాయి.

- నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురి సింది. అయినపూర్‌ గ్రామ శివారులో పిడుగు పడటంతో శీన ప్ప అనే రైతుకు చెందిన గేదె మృతి చెందింది. సుక్కర్‌లింగం పల్లి గ్రామ శివారులో వరి చేలలో నీరు చేరింది.

- మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం వెల్కిచర్ల లో అకాల వర్షానికి వరి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటి ల్లింది. గ్రామానికి చెందిన మల్లికార్జున్‌రెడ్డి అనే రైతుకు చెంది న 14 ఎకరాల్లో వరి నేలకొరిగింది. ఇదే గ్రామంలో ఎనిమిది ఎకరాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మద్దిగట్ల, కొత్తమొల్గర గ్రామాల్లో కూడా పంటలు దెబ్బతినడంతో శుక్రవా రం వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించారు.

- అకాల వర్షానికి వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం, పొలికపాడు, పాటిగడ్డతండా, జాంప్లతండాల్లో వండ గండ్ల వాన కురిసింది. బుద్దారం గ్రామంలో ఎక్కువ నష్టం వా టిల్లింది. ఈ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రై తులు ఆరబెట్టిన వడ్లు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. అ లాగే గోపాల్‌పేట-బుద్దారం మార్గంలో ఈదురు గాలులకు చె ట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పొలాల వద్ద ఉన్న పశువుల పాకల షెడ్లు గాలికి ఎరిగిపోయాయి. కా గా, గోపాల్‌పేట-బుద్దారం మార్గలో రోడ్డుపై విరిగి పడిన చెట్ల ను ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జేసీబీలతో తొలగించారు.

- జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి, వడ్డేపల్లి, అలంపూర్‌ మండలాల్లో శుక్రవారం ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో రాజోలి మండలం తూర్పుగార్లపాడు, పడమర గార్లపా డు, ముండ్లదిన్నె, పెద్దతాండ్రపాడు గ్రామాల్లో పొలాల్లో కోత లు కోసి ఉంచిన కొర్రలు, మొక్కజొన్న తడిసిపోయింది. అలాగే రాజోలిలోని వీవర్స్‌ కాలనీలో ఈదురు గాలులకు భారీ వృక్షాలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. చెట్లు విరిగి పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.



Updated Date - 2021-04-24T05:08:04+05:30 IST