మందారంతో జుట్టు ఆరోగ్యంగా..!
ABN , First Publish Date - 2021-03-14T05:30:00+05:30 IST
జుట్టు రాలుతోందా? వెంట్రుకలు చిట్లిపోతున్నాయా? అయితే మందార పూవులు, ఆకులు తలకు పట్టించండి. మీ సమస్య ఇట్టే దూరమవుతుంది.
జుట్టు రాలుతోందా? వెంట్రుకలు చిట్లిపోతున్నాయా? అయితే మందార పూవులు, ఆకులు తలకు పట్టించండి. మీ సమస్య ఇట్టే దూరమవుతుంది.
- కొన్ని మందారపువ్వులు, కొన్ని మందారచెట్టు ఆకుల్ని తీసుకుని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరినూనెని వేడిచేసి అందులో ఈ మందార ముద్దను వేసి బాగా కలపాలి. ఈ నూనె వేడి చల్లారాక వడకట్టి ఒక సీసాలో పోసుకుని రోజూ రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకుని మర్నాడు ఉదయం తలస్నానం చేయాలి.
- గుప్పెడు మందార ఆకులు, నాలుగు టేబుల్స్పూన్ల పెరుగు కలిపి పేస్టులా చేసుకుని దాన్ని తలకు రాసుకోవాలి. గంట తర్వాత షాంపుతో తలంటుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు నెరవవు.
- ఏడెనిమిది మందార పూలను ముద్దలా నూరుకుని దాన్ని తలకు పట్టించుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే మీ శిరోజాలు పట్టులా మిలమిలాడతాయి.
- మూడు చెంచాల ఉసిరి పొడి, రెండు చెంచాల ఉసిరి రసం, గుప్పెడు మందార ఆకుల్ని కలిపి పేస్టులా చేసుకొని దాన్ని తలంతా పట్టించుకుని 45 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.