జుట్టు రాలడం ఆగాలంటే..!

Published: Mon, 31 May 2021 00:41:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జుట్టు రాలడం ఆగాలంటే..!

జుట్టు రాలుతోంది అనగానే ఆందోళన మొదలవుతుంది. తెలిసిన షాంపూలు, ఇతర ప్రయత్నాలు అన్నీ  చేస్తారు. అలాకాకుండా ముందుగా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 

  • ఇతర సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే ఆ మందుల వల్ల జుట్టు రాలుతూ ఉండవచ్చు. ఒత్తిడి కూడా ఒక కారణమే. జన్యుపరంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ముందుగా కారణం తెలుసుకోవాలి.
  • పోషకాహారం లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి పండ్లు, చేపలు, కోడిగుడ్లు అధికంగా తీసుకోవాలి. నట్స్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • కొంతమంది కాస్త తెల్లజుట్టు కనిపించగానే రంగు వేస్తుంటారు. కానీ రంగు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు.
  • క్యారట్‌ ఎక్కువగా తీసుకోవాలి. వీలైతే జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. ప్రోటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.