ఈ ఏడాదీ హజ్‌ యాత్ర లేదు !

Jun 16 2021 @ 08:44AM

హజ్‌ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు!

న్యూఢిల్లీ /హైదరాబాద్‌: వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌ నుంచి హజ్‌ యాత్ర రద్దయింది. ఈ ఏడాది హజ్‌ యాత్ర కోసం అందిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత హజ్‌ కమిటీ మంగళవారం ప్రకటించింది. కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున పరిమిత సంఖ్యలో స్థానికులను తప్ప, విదేశీ యాత్రికులను హజ్‌కు అనుమతించడం లేదని సౌదీ అరేబియా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. గతేడాది కూడా కరోనా కారణంగా సౌదీ అరేబియా విదేశీ యాత్రికులకు అనుమతించడం లేదని ప్రకటించడంతో భారత ప్రభుత్వం హజ్‌ యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా, భారత హజ్‌ కమిటీ నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో ఈ ఏడాది హజ్‌ యాత్రకు స్వీకరించిన 3757 దరఖాస్తులను రద్దు చేస్తున్నామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ తెలిపింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.