దూసుకెళ్లిన హెచ్ఏల్.. కొత్త గరిష్టానికి స్టాక్..

ABN , First Publish Date - 2022-08-08T18:17:40+05:30 IST

హిందూస్థాన్ ఏరోనాటిక్స్(Hindustan Aeronautics Limited) షేర్లు నేడు దూసుకెళ్లాయి.

దూసుకెళ్లిన హెచ్ఏల్.. కొత్త గరిష్టానికి స్టాక్..

Hindustan Aeronautics Shares : హిందూస్థాన్ ఏరోనాటిక్స్(Hindustan Aeronautics Limited) షేర్లు నేడు దూసుకెళ్లాయి. కంపెనీ షేర్లు సోమవారం బీఎస్ఈలో ఇంట్రాడేలో 5 శాతం ర్యాలీ చేసి సరికొత్త గరిష్టం రూ.2,094కి చేరాయి. గత ఆరు నెలల్లో.. 52 శాతం ర్యాలీ చేసింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌(Benchmark index)లో 1.4 శాతం లాభపడింది. ఏడాది కాలంలో హెచ్ఏఎల్ మార్కెట్ ధర(HAL Market Price) 94 శాతం జూమ్ చేసింది. 


హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఎయిర్ క్రాఫ్ట్(aircraft), హెలికాఫ్టర్స్(helicopters), ఎయిరో ఇంజెన్స్(aero-engines), యాక్ససరీస్(accessories), ఎయిరోస్పేస్ స్ట్రక్చర్స్(aerospace structures) వంటి విస్తృతశ్రేణి ఉత్పత్తుల డిజైన్, డెవలప్‌మెంట్, మ్యానిఫ్యాక్ఛర్, రిపేర్, సర్వీసింగ్‌లో నిమగ్నమై ఉంది. ఏరోస్పేస్ ప్రాంతంలో ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ (అంటే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్) అవసరాలను తీర్చడానికి కంపెనీ ఏర్పాటు చేయబడింది.


ఆత్మనిర్భర్‌ భారత్‌(Atmanirbhar Bharat)లో భాగంగా హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే 1 ‘తేజస్’, లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్‌, హెట్‌టీటీ-40(HTT-40)ను దేశీయంగా అభివృద్ధి చేసింది. హెలికాప్టర్ ఇంజిన్‌లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన కొత్త జాయింట్ వెంచర్‌ను రూపొందించడానికి కంపెనీ, సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్‌లు సంయుక్తంగా ఒక ఒప్పందంపై సంతకం చేశాయని HAL ప్రకటించింది.


Updated Date - 2022-08-08T18:17:40+05:30 IST