సాయిబాబా ఆలయంలో హంపి పీఠాధిపతి పూజలు

Published: Wed, 06 Jul 2022 01:33:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సాయిబాబా ఆలయంలో హంపి పీఠాధిపతి పూజలుసాయినాథుడికి హారతినిస్తున్న హంపి పీఠాధిపతి

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 5 : స్థానిక గండిరామన్న దత్తసాయి ఆలయంలో మంగళవారం హంపి పీఠాధిపతి శంకరాచార్యులు పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు జరిపారు. ఆలయ సింగల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కిడి జగన్మోహన్‌రెడ్డి ఆయనను సన్మానించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా శంకరాచార్యులు తమ సందేశంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. సాయిబాబా ఆలయంలో ఎంతో ప్రశాంతత లభిస్తుందన్నారు. సాయి దర్శనంతో సకల పాపాలు తొలగిపోతాయన్నారు. భక్తులు శంకరాచార్యులను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.