Srinagar airportలో ఆర్మీ జవాన్ బ్యాగేజీలో లైవ్ హ్యాండ్ గ్రెనేడ్ స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-02T17:51:12+05:30 IST
జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఓ ఆర్మీ జవాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు....
శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఓ ఆర్మీ జవాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ జవాన్ సామాన్ల బ్యాగును స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో అందులో నుంచి లైవ్ హ్యాండ్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన ఆర్మీ జవాన్ బాలాజీ సంపత్‌గా గుర్తించారు.ఆర్మీ జవాన్ సంపత్ ఇండిగో విమానంలో శ్రీనగర్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నైకి ప్రయాణిస్తుండగా గ్రెనెడ్ దొరికింది. దీంతో సంపత్ ను తదుపరి విచారణ కోసం శ్రీనగర్ పోలీసులకు అప్పగించారు.