ఆత్మ విశ్వాసమే ఆయుధం

ABN , First Publish Date - 2020-12-03T04:55:22+05:30 IST

ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది వివిధ రకాల అంగ వైకల్యంతో బాధపడుతున్నారు. వారిలో అధిక భాగం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుగున్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా జీవితంలో స్థిరపడుతున్నారు.

ఆత్మ విశ్వాసమే ఆయుధం

పట్టుదలతో ఎంచుకున్న రంగాల్లో ముందడుగు

వికలాంగుల గోడు పట్టని పాలకులు

అందని ప్రోత్సాహకాలు, పథకాలు

నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఖమ్మం ఖానాపురంహవేలి/ చుంచుపల్లి,  డిసెంబరు 2: ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది వివిధ రకాల అంగ వైకల్యంతో బాధపడుతున్నారు. వారిలో అధిక భాగం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుగున్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా జీవితంలో స్థిరపడుతున్నారు. వారికి ఏటా డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాలుగు ట్రైసైకిళ్లు చేతి కర్రలు, వినికిడి యంత్రాలు పంపిణీ చేసి నాయకులు, అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. అయితే ప్రభుత్వం వికలాంగులకు తోడ్పాట్లను అందిస్తే వారు సొంతకాళ్లపై నిలబడి సాధారణ పౌరులకు దీటుగా జీవితంలో ముందడుగు వేస్తారు. 

అమలుకాని రిజర్వేషన్‌

ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో లేవు. సదరం క్యాంపునకు పోతే తప్పా దివ్యాంగులను గుర్తించే పరిస్థితి లేదు. అర్హులైన వికలాంగులకు కొంత మొత్తం పింఛన్‌ అందించి విస్మరిస్తున్నారు. వికలాంగులకు ఇళ్లస్థలాలు, వ్యవసాయ భూమి, నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించాలనే డిమాండ్‌ ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. వేలాదిమంది మూగ, బదిరి, మానసిక, దుష్టిలోపం శారీరకలోపం తదితర సమస్యలతో జీవిస్తున్నారు. మానసిక వికలాంగు లకు మనో ప్రగతి కింద కేంద్రం కొన్ని సంక్షేమపథకాలు అందిస్తుంది. వికలాంగులపై చిన్నచూపు చూడకుండా వారిపై జాలిచూపడం కన్నా సాటి మనుషులుగా గుర్తిస్తే చాలని, వారికి అవసరమైన తోడ్పాటు అందించి సాధారణజీవంలో భాగస్వామల య్యేలా చూడాలి. వికలాంగులకు అందిస్తున్న పింఛన్లలో వందశాతం అందడంలేదని, ఎక్కువశాతం వికలాంగులకు పింఛన్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేటికి అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రోత్సాహకాలు

ఖమ్మం జిల్లాలో 29,813మంది దివ్యాంగులు ఉన్నారు. మహిళ శిశుసంక్షేమశాఖ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో వందమంది దివ్యాంగులకు చదువుకోవడానికి ప్రభుత్వ వసతిగృహం అందుబాటులో ఉన్నది. 1నుంచి 10వతరగతి వరకు దివ్యాంగులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. దివ్యాంగులు, వికలాంగులు కలిసి వివాహం చేసుకున్న జంటలకు వివాహ ప్రోత్సాహం బహుమతిని మంజూరుచేస్తున్నారు. నాలుగు స్వచ్ఛంధ సంస్థలు ద్వారా దివ్యాంగులు చదువుకోవడానికి పూర్తిసహా య సహకారాలు అందిస్తున్నారు. వికలాంగులకు సంబం ధించి రెండేళ్లుగా జిల్లా కార్యాలయంలో ట్రైసైకిళ్ల కొరకు సుమారు 600 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  

 సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

సంధ్యారాణి, జిల్లా సంక్షేమాధికారి, ఖమ్మం 

జిల్లాలోని వికలాంగులందరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో అందిస్తున్నాం. గత రెండేళ్లుగా ప్రభుత్వం వికాగులకు అందించాల్సిన ట్రైసైకిళ్లు, ప్రభుత్వం నుంచి సకాలంలో రాకపోడంతో కొంత ఆలస్య మైంది. జనవరి మొదటివారం నుంచి ట్రైసైకిళ్లను అర్హులైన వికలాగులందరికి అందిస్తాం.  


Updated Date - 2020-12-03T04:55:22+05:30 IST