చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-08-08T06:01:11+05:30 IST

చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు. ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి
జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ చేనేత దినోత్సవాలను ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

మహారాణిపేట, ఆగస్టు 7:  చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు. ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తరువాత  అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమని వివరించారు. రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది ప్రత్యక్ష్యంగా, మరో 50 వేల మంది పరోక్షంగా చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారని వివరించారు. గత మూడు సంవత్సరాల్లో రూ.573 కోట్లు  చేనేత రంగం అభివృద్ధికి వెచ్చించినట్టు తెలిపారు. ప్రైవేటు వస్త్ర సంస్థలకు దీటుగా ఆప్కో మెగా షోరూమ్‌లను విశాఖలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జౌళి శాఖ డైరెక్టర్‌ నాగమణి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T06:01:11+05:30 IST