చేనేతల బతుకు దుర్భరం

ABN , First Publish Date - 2020-12-04T05:01:00+05:30 IST

చేనేత కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ అన్నారు.

చేనేతల బతుకు దుర్భరం
మగ్గం గుంటలో నీటిని పరిశీలిస్తున్న అజీజ్‌

సౌత్‌మోపూరులో టీడీపీ నేత అజీజ్‌ 


నెల్లూరు రూరల్‌, డిసెంబరు 3 : చేనేత కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ అన్నారు. గురువారం మండలంలోని సౌత్‌మోపూరు గ్రామంలో నీటి మునిగిన మగ్గాలను ఆయన పరిశీలించారు. చేనేత కార్మికుల అవస్థలను తెలుసుకున్నారు. కార్మికులకు అందే కూలిరేట్లు దయనీయంగా ఉన్నాయన్నారు. ముగ్గురు వ్యక్తులు రోజంతా కష్టపడి పనిచేస్తే రూ.200 వస్తోందని, ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మగ్గం గుంటల్లోకి నీళ్లు చేరడంతో మరో నెల రోజులు నేత పని సాగదని, కార్మికులకు ప్రభుత్వం  అండగా నిలవాలని కోరారు. అనంతరం సీపీఐ సీనియర్‌ నేత పీ దశరఽథరామయ్య నివాసానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పముజుల ప్రదీప్‌, నాయకులు జలదంకి సుధాకర్‌, అన్నం సుధాకర్‌, జక్కల సుబ్బయ్య, పముజుల గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు. 


వరద బాధితులకు చేయూత 

నివర్‌ తుఫాన్‌ కారణంగా గుడిపల్లిపాడు వద్దనున్న బలరామపురం గిరిజనకాలనీలో వరద ముంపునకు గురైన కుటుంబాలకు టీడీపీ నాయకులు గురువారం ఆహార పొట్లాలు అందించారు. స్థానిక డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి మేకల అనిల్‌కుమార్‌, నాయకులు హుస్సేన్‌, అజీజుల్లా, ప్రతాప్‌, హరికృష్ణ, శేఖర్‌, హరి పాల్గొన్నారు. 

=======================

Updated Date - 2020-12-04T05:01:00+05:30 IST