చేతికొచ్చిన పంట నీటిపాలు

ABN , First Publish Date - 2021-10-17T06:29:34+05:30 IST

అకాల వర్షం రైతన్నకు మరోసారి కన్నీరు తెప్పించింది. జిల్లాలోని నిజామాబాద్‌ రూరల్‌, నవీపేట, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, బోధన్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో వరి పంట తడిసింది.

చేతికొచ్చిన పంట నీటిపాలు
నవీపేట, జక్రాన్‌పల్లి, రూరల్‌ మండలాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యం

అకాల వర్షంతో తడిసిన ధాన్యం

కోసి ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం

నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబరు 16: అకాల వర్షం రైతన్నకు మరోసారి కన్నీరు తెప్పించింది. జిల్లాలోని నిజామాబాద్‌ రూరల్‌, నవీపేట, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, బోధన్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో వరి పంట తడిసింది. రూరల్‌ మండలంలోని గుండారం, మల్లారం, పాల్ద, తిర్మన్‌పల్లి, ఆకుల కొండూరు, చక్రధర్‌నగర్‌, గాంధీనగర్‌, కొత్తపేటతోపాటు పలు గ్రామాల్లో  ముందస్తుగా వరి వేసిన రైతులు వారం రోజుల క్రితమే కో తలు కోశారు. కోసిన వరి ధాన్యం తేమను తగ్గించేందుకు కళ్లాల్లో, రోడ్డుమీద ఆరబెట్టారు. రోడ్లమీద, కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడి తగ్గి పొడిగా మారుతున్న సమయంలో అకాల వర్షం కురిసింది. దాంతో రోడ్డుమీద ఆరబెట్టిన వరి ధాన్యం నీటిపాలైంది. కొంతమేర నీటిలో కొట్టుకుపోయింది. కొందరు రైతులు పంటను కోసి ధాన్యం ఇంకా పొలంలోనే ఉంచారు. అటువంటి ధాన్యం మొత్తం నేలరాలింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం మాత్రం నేల రాలిపోయింది. రూరల్‌ మండలంలో వందల ఎకరాల్లో రైతులు దొడ్డు రకం దాన్యం సాగుచేశారు. దొడ్డు రకం ధాన్యం నష్టాలపాలై ంది. సన్న రకం ధాన్యం పెద్దగా నష్టం వాటిల్లినట్టు గ్రామస్థులు తెలిపారు. ముందుగా వేసిన రైతుల పంట కోతకు వచ్చింది. కొన్ని గ్రామాల్లో కోతలు సైతం ముగిశాయి. దసరా పండుగ సందర్బంగా సొసైటీలు ధాన్యం కొనుగోళ్లు ఇం కా ప్రారంభించలేదు. మరో వారం, పది రోజుల్లో ధాన్యం కొనుగోల్లు జరుగుతాయిన ఆశించిన రైతుల ఆశలు గల్లంతయ్యాయి. దీంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగో లు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందిం చాలని వారు కోరుతున్నారు.  

నవీపేట మండలంలో..

నవీపేట: మండలంలోని పలు గ్రామాలలోనూ ధాన్యం తడిసిపోయింది. మండలంలోని పలు గ్రామాలలో గత పదిహేను రోజుల నుంచి వరికోతలు ప్రారంభమయ్యాయి. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకోగా శనివారం తెల్లవారుజాము నుంచి అకాల వర్షం కురియడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన వరిపంట అకాల వర్ష ంతో తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని నవీపేట, కమలాపూర్‌, మోకన్‌పల్లి, పొతంగల్‌, నాడాపూర్‌ తదితర గ్రామాలలో అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. వరికోతలు ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం శోచనీయమని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో దళారులకు ధాన్యం విక్రయిస్తున్నామని పలువురు రైతులు వాపోయారు. దళారులు క్వింటాకు మూడు కిలోల తరుగు తీసుకుని కేవలం రూ.1,400లే చెల్లిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి మద్దతు ధర అందించాలని రైతులు వేడుకుంటున్నారు. 

డిచ్‌పల్లి మండలంలో

డిచ్‌పల్లి: మండలంలోని ఘన్‌పూర్‌, సుద్దపల్లి, సాంపల్లి, యానంపల్లి, ముల్లంగి గ్రామాల్లో అకాల వర్షానికి ఆరబోసి న ధాన్యం చాలా వరకు వర్షార్పణమైంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన వరి కళ్ల ముందే తడిసి ముద్దవుతుంటే రైతులు బోరున విలపిస్తున్నారు.  

జక్రాన్‌పల్లి మండలంలో..

జక్రాన్‌పల్లి: మండలంలో కురిసిన అకాల వర్షానికి సర్వీ స్‌ రోడ్డు వెంట ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల ధాన్యం కొట్టుకుపోయ్యిందని రై తులు తెలిపారు. మండలంలో శనివారం సాయంత్రం 30 నిమిషాల పాటు భారీ అకాల వర్షం కురిసింది.  

బోధన్‌ డివిజన్‌లో 

బోధన్‌రూరల్‌: బోధన్‌ డివిజన్‌లో శనివారం భారీ వర్ష ం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ ర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేతికొచ్చిన వరిపంట నేలకొరిగింది. 

Updated Date - 2021-10-17T06:29:34+05:30 IST