మేక చర్మాన్ని పులి చర్మంగా విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-04T16:44:45+05:30 IST

మేక చర్మాన్ని పులి చర్మంగా విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

మేక చర్మాన్ని పులి చర్మంగా విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

హనుమకొండ: మేక చర్మాన్ని పులి చర్మంగా  విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎండీ మహ్మద్ గౌస్ పల్లి గ్రామంలో  పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.  మేక చర్మానికి ఒరిజినల్ టైగర్ స్కిన్ లాగా ఉండేలా రంగులు వేసి నకిలీ టైగర్ స్కిన్‌ తయారు చేశారు. అసలైన పులి చర్మంగా రూ.16 లక్షలకు కస్టమర్‌కు విక్రయించేందుకు  ప్రయత్నించారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. 

Updated Date - 2022-04-04T16:44:45+05:30 IST