వరుసకు సోదరుడు..కానీ తనతో గడపాలని బెదిరించడంతో..

ABN , First Publish Date - 2022-08-23T14:57:33+05:30 IST

దామెర మండలం లాదెళ్లలో విషాదం చోటు చేసుకుంది. యువకుడి లైంగిక వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వరుసకు సోదరుడు..కానీ తనతో గడపాలని బెదిరించడంతో..

Hanumakonda: దామెర మండలం లాదెళ్లలో విషాదం చోటు చేసుకుంది. యువకుడి లైంగిక వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాదెళ్ల గ్రామానికి చెందిన యువతి శీలం మౌనిక (19) అదే గ్రామానికి చెందిన సంఘాల సాయితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. అయితే..ఈ విషయం వరుసకు సోదరుడైన ప్రణయ్‎కు తెలియడంతో సోదరిని బెదిరించడం మొదలుపెట్టాడు. తనతో గడపాలని లేదంటే.. ఆమె ప్రేమ వ్యవహారం ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతానని తాళ్ల ప్రణయ్ యువతిని బెదిరించాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-23T14:57:33+05:30 IST