భక్తి శ్రద్ధలతో హనుమజ్జయంతి

ABN , First Publish Date - 2022-05-26T05:14:40+05:30 IST

శింగరకకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో హనుమజ్జయంతిని బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్‌ దీక్షా భక్తులు ఇరుముడులతో వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇరుముడి ద్రవ్యాలను సమర్పించారు. బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, బిందె తీర్థం, గోపూజ నిర్వహించారు. స్వామి వారికి నిత్య అభిషేకం నిర్వహించారు. దీక్షాధారులు ఆలయ ప్రదక్షణ నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో హనుమజ్జయంతి
శింగరకొండ లో ఉ ష్ట్ర వాహనం(ఒంటె వాహనం) పై నిర్వహిస్తున్న స్వామి వారి ఊరేగింపు

ఇరుముడులు సమర్పించిన దీక్షాధారులు

అద్దంకి, మే25: శింగరకకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో హనుమజ్జయంతిని బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్‌ దీక్షా భక్తులు ఇరుముడులతో వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇరుముడి ద్రవ్యాలను సమర్పించారు. బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, బిందె  తీర్థం, గోపూజ  నిర్వహించారు. స్వామి వారికి నిత్య అభిషేకం నిర్వహించారు. దీక్షాధారులు ఆలయ ప్రదక్షణ నిర్వహించారు. స్వామి వారిని  ఉష్ట్ర వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం కోలాట బృందం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. స్వామి వారి మూలవిరాట్‌ కు లక్ష నాగవల్లీ దళార్చన నిర్వహించారు. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య  శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో రఘునాఽథరెడ్డి, డైరెక్టర్‌లు పబ్బిశెట్టి శ్రీనివాసరావు, అన్నాబత్తిన సీతారామయ్య, జమ్మలమడక రమాదేవి హనుమంతరావు, కుందుర్తి ర జనీరాఘవరెడ్డి, అద్దంకి నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, సర్పంచ్‌ ఎర్రిబోయిన తిరుపతయ్య, వైసీపీ అద్దంకి పట్టణ పార్టీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని  వేలమూరిపాడు రోడ్డులో ఆంజనేయస్వామి దేవాలయం, శింగరకొండ సమీపంలోని 99 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం వద్ద, మండలంలోని తిమ్మాయపాలెం, కొటికలపూడి పంచాయతీ శ్రీరామ్‌నగర్‌ కాలనీలలో ఆంజనేయస్వామి విగ్రహాల వద్ద హనుమజ్జయంతి సందర ్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 బల్లికురవలో..

బల్లికురవ : మండలంలోని పలు గ్రామాలలో హనుమజ్జయంతి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. కొత్తపాలెం, గుంటుపల్లి, అంబడిపూడి, నక్కబొక్కలపాడు, కొనిదెన, గంగపాలెం, ముక్తేశ్వరం, కొప్పెరపాడు, కొండాయపాలెం, వైదన, కొమ్మినేనివారిపాలెం, కూకట్లపల్లి, మల్లాయపాలెం గ్రామాలలో ఆంజనేయస్వామి విగ్రహాల వద్ద భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.  


Updated Date - 2022-05-26T05:14:40+05:30 IST