HanuMan: కొత్త షెడ్యూల్ ప్రారంభం

Published: Mon, 24 Jan 2022 14:33:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
HanuMan:  కొత్త షెడ్యూల్ ప్రారంభం

బాలనటుడిగా టాలీవుడ్ లో లెక్కకు మించిన చిత్రాల్లో నటించాడు తేజా సజ్జా.  జాంబిరెడ్డితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఇష్క్, అద్భుతం’ లాంటి ప్రేమకథా చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. హీరోగా మూడు చిత్రాల్లోనే నటించిన ఈ కుర్రాడు ఇప్పుడు ఏకంగా సూపర్ హీరో అయిపోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హనుమాన్’ చిత్రంతో తేజ టాలీవుడ్‌లో తొలి సూపర్ హీరోగా అవతరించబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయక్రిష్, కృష్ణ సౌరభ్ ఈ సినిమాకి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఇది వరకు కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ‘హనుమాన్’ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు (సోమవారం) హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. 


విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఓ గ్రామంలో అల్లరచిల్లరగా తిరిగే ఒక యువకుడు... అనూహ్యంగా వచ్చిన పవర్స్ తో సూపర్ మేన్ గా మారతాడు. తన గ్రామానికి వచ్చిన కష్టాన్ని తన శక్తులతో ఎలా రూపుమాపుతాడు అన్నదే ఈ సినిమా కథాంశం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కాబోతోంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International