హనుమత్‌ జయంతోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-24T04:22:19+05:30 IST

కావలి పట్టణం ముసునూరులో ట్రంకురోడ్డు వద్ద నున్న హనుమత్‌ క్షేత్రంలో సోమవారం నుంచి హనుమత్‌ జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి.

హనుమత్‌ జయంతోత్సవాలు ప్రారంభం
ముస్తాబైన హనుమత్‌ క్షేత్రం

కావలిటౌన్‌, మే 23: కావలి పట్టణం ముసునూరులో ట్రంకురోడ్డు వద్ద నున్న హనుమత్‌ క్షేత్రంలో సోమవారం నుంచి హనుమత్‌ జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమత్‌ క్షేత్రం వ్యవస్థాపక అర్చకుడు వేదగిరి సూర్యనారాయణాచార్యులు పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జయంతోత్సవాలు 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సోమవారం ప్రత్యేక యాగ పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం హనుమత్‌ జయంతి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 108 కలశముల స్థాపన, అనంతరం నవగ్రహదోష పూజలు, శాంతి అభిషేకాలు, జరుగాతాయన్నారు. 10-30గంటలకు సామూహిక లక్ష తమలపాకులు అర్చన, మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమాలు, సాయంత్రం పూలంగి సేవలు జరుగాతాయని నిర్వాహకులు తెలిపారు. 26న పంచముఖ గాయత్రి హోమం, సాయంత్రం గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 

Updated Date - 2022-05-24T04:22:19+05:30 IST