ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ క్రీడలు

ABN , First Publish Date - 2021-09-17T06:30:44+05:30 IST

హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎ్‌స)లో జాతీయస్థాయి ఓపెన్‌ టూఆల్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీలు జోరుగా సాగుతున్నాయి. గురువారం జేఎన్‌ఎ్‌సతో పాటు, నిట్‌ క్రీడా మైదానంలో కూడా పోటీలు జరిగాయి.

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ క్రీడలు

రెండో రోజు వెల్లివిరిసిన ప్రతిభ
గత రికార్డులను తిరగరాస్తున్న అథ్లెట్లు


హనుమకొండ స్పోర్ట్స్‌, సెప్టెంబరు 16: హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎ్‌స)లో  జాతీయస్థాయి ఓపెన్‌ టూఆల్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీలు జోరుగా సాగుతున్నాయి. గురువారం జేఎన్‌ఎ్‌సతో పాటు, నిట్‌ క్రీడా మైదానంలో కూడా పోటీలు జరిగాయి.  20కిలో మీటర్ల మెన్‌, ఉమెన్‌ రేస్‌వాక్‌లో క్రీడాకారులు  నువ్వా నేనా అనే విధంగా పోటీపడ్డారు.

పురుషుల 100మీటర్ల పరుగుపందెంలో ఇప్పటివరకు చెన్నైకి చెందిన అనిల్‌కుమార్‌ పేరున ఉన్న 10.37 రికార్డును, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేశ్‌కుమార్‌ 10.30 నిమిషాల్లో ఛేదించి రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా 1500 మీటర్ల మహిళా పరుగుపందెంలో సునితరాణి బుసన్‌ సాధించిన 4.06 సెకన్ల రికార్డును పంజాబ్‌కు చెందిన హర్‌మిలాన్‌ బైన్స్‌ 4.05 సెకన్లలో గమ్యాన్ని ఛేదించి బ్రేక్‌ చేసింది.

డెకాథ్లాన్‌ పురుషుల విభాగంలో 10ఈవెంట్లు ఉండగా, ఇందులో మొదటి రోజు 5ఈవెంట్లు పూర్తి అయ్యాయి.  5ఈవెంట్లు హార్డిల్స్‌, డిస్క్‌సత్రో, పోల్‌వాల్ట్‌, జావెలిన్‌త్రో, 1500మీటర్ల పరుగు పందెంలో గురువారం పోటీలు జరిగాయి. 100మీటర్ల ఉమెన్‌ హార్డిల్స్‌, 4ఇంటు 400రిలే మిక్స్‌డ్‌, మెన్‌ షాట్‌పుట్‌. పోల్‌వాల్ట్‌, జావెలిన్‌త్రో, 100మీటర్ల పరుగుపందెం, ఉమెన్‌ హైజంప్‌, 100మీటర్ల పరుగుపందెం, షాట్‌పుట్‌, 400మీటర్ల పరుగుపందెం, మెన్‌400మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్‌, జావెలిన్‌త్రో, 1500మీటర్ల పరుగుపందెం, ఉమెన్‌1500మీటర్ల పరుగు పందెం, మెన్‌ 4ఇంటు400రిలే, 4ఇంటు400 పరుగు పందెంలో పోటీలు జరిగాయి.

పోటీల నిర్వహణలో హనుమకొండ డీవైఎ్‌సవో గుగులోతు అశోక్‌కుమార్‌, జాతీయ కోచ్‌ నాగపురి రమేశ్‌, అసోసియేషన్‌ కార్యదర్శి సారంగపాణి, జిల్లా అసోసియేషన్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, సీనియర్‌ అథ్లెట్‌, తెలంగాణ అథ్లెటిక్స్‌ మహిళా కోచ్‌ నాగమణి, కోచ్‌లు, టెక్నికల్‌ అఫిషీయల్స్‌, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా క్రీడల అధికారికి భంగపాటు
అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో హనుమకొండ జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి (డీవైఎ్‌సఓ)కి గురువారం భంగపాటు ఎదురైంది. క్రీడల పర్యవేక్షణ కోసం వచ్చిన డీవైఎ్‌సఓ అశోక్‌కుమార్‌ను పోలీసులు మైదానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.  తాను అధికారిని అని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో ఇతర నిర్వాహకులు కలుగజేసుకొని పోలీసులతో నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కాగా, నిర్వాహకులు వీఐపీ, ప్రెస్‌, వలంటీర్లకు అనుమతికార్డులను ఇచ్చినప్పటికీ పోలీసుల అత్యుత్సాహంతో గేట్ల వద్దనే అడ్డుకుంటున్నారు.

కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది..

- తరణ్‌జిత్‌ కౌర్‌, 100 మీటర్ల మహిళల విభాగంలో స్వర్ణ పతక విజేత
గతంలో జూనియర్‌ విభాగంలో  రెండు బంగారు పతకాలు, ఒక సిల్వర్‌ పతకం సాధించాను. ఇప్పుడు 100 మీటర్ల రన్నింగ్‌ విభాగంలో బంగారు పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది.  నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మా స్వస్థలం ఢిల్లీ.


అమ్మనాన్నల ప్రోత్సాహ ఫలితం

- విత్య రామ్‌రాజ్‌, 400 మీటర్ల మహిళల విభాగంలో స్వర్ణ పతక విజేత
నేను ఇటీవల జపాన్‌లో జరిగిన ఒలంపిక్‌ గేమ్స్‌కు సెలెక్ట్‌ అయ్యాను. కానీ కరో నా రావడం వల్ల పాల్గొనలేకపోయా ను. చాలా బాధేసింది. మళ్లీ కోలుకు ని  ఇప్పుడు వరంగల్‌ జాతీయస్థాయి పోటీలకు హాజరయ్యాను. ఇక్కడ 400 మీటర్ల రన్నింగ్‌ రేస్‌లో బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది.  























Updated Date - 2021-09-17T06:30:44+05:30 IST