
ఈ తరం నటుల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేసిన కొద్దిమంది నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. దక్షిణాదిన పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఆయన. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్’ చిత్రంలో సేతుపతి కీలకపాత్రలో నటించారు. అందులో తను విలన్ పాత్ర పోషించినట్లు చెప్పారు సేతుపతి. తెలుగులో ‘ఉప్పెన’, తమిళంలో ‘మాస్టర్’, ఇప్పడు ‘విక్రమ్’ చిత్రాల్లో వరుసగా విలన్ పాత్రలో అవకాశాలు రావడం తనకు సంతోషంగా ఉందన్నారు సేతుపతి. ‘విలన్ పాత్రల ప్రభావం నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. మానవప్రవృత్తిలోని చీకటికోణాన్ని అన్వేషించడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే విలన్ పాత్రలకు వచ్చే ఆఫర్లను సంతోషంగా స్వీకరిస్తున్నాను’ అన్నారు.