ఘనంగా ఆజాదీకా అమృత్‌మహోత్సవ్‌

ABN , First Publish Date - 2022-08-14T05:27:03+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు కావడంతో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలతో శనివారం పీలేరు పట్ణణం హోరెత్తింది.

ఘనంగా ఆజాదీకా అమృత్‌మహోత్సవ్‌
ములకలచెరువులో మానవహారంగా మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు



తిరంగా ర్యాలీలతో హోరెత్తించిన విద్యార్థులు

పీలేరు, ఆగస్టు 13:  దేశానికి  స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు కావడంతో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నాం.  ఇందులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలతో శనివారం పీలేరు పట్ణణం హోరెత్తింది. పీలేరులోని సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్పీ ఉర్దూ ఉన్నత, ప్రాథమిక, జడ్పీ మెయిన్‌, కోటపల్లె బాలికల ఉన్నత, వీఎస్‌ఎన్‌, శ్రీచైత న్య పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించడంతో పట్టణంలో ప్రత్యేక శోభ వెల్లివిరిసిం ది.  మార్కెట్‌ కమిటీలో వీఎస్‌ఎన్‌ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 300 అడుగుల జాతీయ జెండాలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీచైతన్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయ కుల వేషధారణతో కోటపల్లె బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ డాక్టర్‌ హబీబ్‌ బాషా, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, వీఎస్‌ ఎన్‌ మాధవి, సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రవికు మార్‌, ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర, పంచాయతీ కార్యదర్శి రెడ్డిప్ర సాద్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ సురేశ్‌, ఏఎస్‌ఐ జాఫర్‌ ఖాన్‌, హెచ్‌సీ చంద్రశేఖర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

మదనపల్లె టౌన్‌లో: విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందాలని వన్‌టౌన్‌ సీఐ ఈదురుబాషా పేర్కొన్నారు. శనివారం స్థానిక విజయభారతి హైస్కూల్‌ విద్యార్థులు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు.  మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జింకా వెంకటాచల పతి, ప్రిన్సిపాల్‌ ఎన్‌.సేతు,  సి.సాయిశేఖర్‌రెడ్డి, అజ్మతు ల్లాఖాన్‌, బర్నేపల్లె రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా స్థానిక ప్రభు త్వ మహిళా డిగ్రీ కళాశాల, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు మొమెంటోలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, రమాదేవి,  అధ్యాపకులు ఖాజావలి, మోహనవల్లి, వనజ తదితరులు పాల్గొన్నారు.

కలకడలో: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం కలకడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ వెంకటరమణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్ర మంలో అధ్యాపకులు మునిగోపాల్‌, పుష్పకుమారి, లక్ష్మీదేవి, రమణ, నాగేంద్రరెడ్డి, విశ్వనాథ్‌, వెంకటేశ్వర్లు, సిబ్బంది సిద్దయ్య, నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. 

ములకలచెరువులో: మండలంలో శనివారం ఆజాదికా అమృత మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాల విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతబట్టి ప్రదర్శనలు చేపట్టారు. అలాగే ములకలచెరువులో మోడల్‌ స్కూల్‌ విద్యార్ధులు పాఠశాల నుంచి బస్టాండు సర్కిల్‌ వర కు ప్రదర్శన చేపట్టి అనంతరం మానవహారం ఏర్పాటు చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. హర్‌ ఘర్‌పై తిరంగా లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడింది. 

వాల్మీకిపురంలో: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా శనివారం వాల్మీకిపురంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బజారు వీధికి చెందిన స్టిక్కర్‌హౌస్‌ బాబు స్వాతంత్య్ర దినోత్సవం 75వసంతాల వేడుకల సం దర్భంగా 75నాణేలపై చిత్రించిన జాతీయ జెండాతో స్వాగ తం పలుకుతూ రూపొందించిన చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంది. గాంధీబస్టాండ్‌లోని మహాత్మా గాంధీ ప్రాంగ ణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు నందు జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ న్యాయవాదు లు, కోర్టు సిబ్బందికి జాతీయ జెండా బ్యాడ్జిలని పంపిణీ చేశారు. స్థానిక పీవీసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యా పకులు, విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు.

తంబళ్లపల్లెలో:ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవే యాలని ఎంఈవో త్యాగరాజు పేర్కొన్నారు. శనివారం మండ లంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అజాదీకా అమృత్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తంబళ్లపల్లె మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు జాతీయ పతాకం చేత పట్టి  భారత్‌ మాతాకీ జై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ హేమంత్‌ కుమార్‌, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.  తంబళ్లపల్లె జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.  ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేడుకలు 

పెద్దమండ్యంలో: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేడకల ను పెద్దమండ్యంలో ఘనంగా  నిర్వహించారు.  జాతీయ నాయకుల వేషఽధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  తహసీల్దార్‌ నిర్మళాదేవి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీమ పతాకాన్ని ఎగరవేయాల న్నారు.  కలిచెర్ల లో జూనియర్‌ కాలేజి విద్యార్థులు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకున్నారు. ఎంపీపీ పూర్ణచం ద్రిక రమేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు పీరమ్మ, ఎంపీడీవో శ్రీధర్‌ రావు, ఎంఈవో మనోహర్‌, ఎస్‌ఐ వెంకటేష్‌ సర్పంచు లు, ఎంపీటీసీలు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 

కలికిరిలో: కలికిరి పట్టణంలో గ్రామ పంచాయతీ సర్పంచు ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలకు చెం దిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసులు ర్యాలీలో పాల్గొ న్నారు. కాగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా 4 వేల మందితో జాతీయ జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు, ఉర్దూ ప్రాథమిక, హైస్కూల్‌, ఉర్దూ జూనియర్‌ కళాశాలల విద్యా ర్థులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-14T05:27:03+05:30 IST