ఘనంగా డాక్టర్ల దినోత్సవం

ABN , First Publish Date - 2022-07-02T05:38:20+05:30 IST

జిల్లా కేంద్రంలో శుక్రవా రం డాక్టర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా డాక్టర్ల దినోత్సవం
డాక్టర్‌ రాంకిషన్‌ దంపతులను సన్మానిస్తున్న అంధుల పాఠశాల ఉపాధ్యాయులు

- జనరల్‌ ఆసుపత్రిలో సీనియర్‌ సిటిజన్ల వైద్య శిబిరం విజయవంతం

- అంధుల పాఠశాలలో అన్నదానం

- సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), జూలై 1 : జిల్లా కేంద్రంలో శుక్రవా రం డాక్టర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభు త్వ జనరల్‌ ఆసుపత్రిలో సీనియర్‌ సిటిజన్లకు ఉచిత మెగా స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి సీనియర్‌ సిటిజన్‌ రోగులు దాదాపు 120 మంది వచ్చారు. వారికి గుండె, న్యూరాలజీ, ఆర్థోపెడిక్‌ విభా గాలకు సంబంధించిన పరీక్షలు చేశారు. సిటిజన్లకు వారి ఆరోగ్యానికి సంబంధించిన ఎక్స్‌రే, స్కానింగ్‌, ఈసీజీ, 2డీఈకో, కార్డియక్‌ ప్రొఫైల్‌, సీబీపీ, రీనల్‌ ఫంక్షన్‌ టెస్టు పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. అనంతరం ఈ శిబిరంలో పాల్గొన్న డాక్టర్లను సన్మానించా రు. డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అంధుల పాఠశా లలో బీసీ రాయ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యార్థులకు అన్నదానం చేశారు. పాఠశాల వారు  డాక్టర్‌ రాంకిషన్‌ దంపతులను సన్మానించారు. సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలోనూ డాక్టర్ల దినోత్సవాన్ని తమ కార్యాలయంలో నిర్వహించారు. పట్టణంలోని సీనియర్‌ డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో నూ కేక్‌ కట్‌ చేసి డాక్టర్ల దినోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, గుండె వైద్య నిపుణులు భరత్‌కుమార్‌, న్యూరో సర్జన్‌ శ్రీనివాస్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్‌, ఆర్థోపెడిక్‌, ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీవన్‌, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ వంశీకృష్ణ, డాక్టర్‌ సిరాజుద్దీన్‌, డీఆర్డీఏ పీడీ యాదయ్య, న్యాయవాది జనార్దన్‌, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నర్సింహులు, డాక్టర్లు, డాక్టర్‌ శామ్యూల్‌, గంగాధర్‌గౌడ్‌, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, నాగభూషణం, ఈసీ సభ్యులు రాజసిం హుడు, వైద్యకళాశాల ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ నవకళ్యాణి, ఆయా విభా గాల హెచ్‌వోడీలు, ఫ్యాకల్టీ, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.

సీనియర్‌ వైద్యులకు సన్మానం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సీ నియర్‌ వైద్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ రాంమోహన్‌, డాక్టర్‌ శామ్యూల్‌, డాక్టర్‌ అన సూయరెడ్డి, డాక్టర్‌ రజిని, డాక్టర్‌ మీనాక్షిలను జ్ఞాపికలు అందజేసి సత్క రించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, అడిషనల్‌ డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్‌ సరస్వతి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శశికాం త్‌, డీఐవో డాక్టర్‌ శంకర్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ రఫీక్‌, డాక్టర్‌ సంధ్యాకి రణ్మయి, ఏవో భాస్కర్‌ నాయక్‌, డెమో తిరుపతిరావు పాల్గొన్నారు.

- జిల్లాకేంద్రంలోని రెడ్‌క్రాస్‌ అనాథశరణాలయంలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సిమ్స్‌ ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్‌ ప్రశాంతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌, డాక్టర్‌ అర్చన, అనాథాశ్రమం సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-02T05:38:20+05:30 IST