హ్యాపీ హ్యీపీగా ఉండాలంటే..

Published: Tue, 21 Dec 2021 14:22:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హ్యాపీ హ్యీపీగా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(21-12-2021)

మనసు ఉల్లాసంగా ఉరకలేయాలంటే ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌ ‘డోపడైన్‌’ మెరుగ్గా ఉండాలి. ఈ హార్మోన్‌ సరిపడా ఉత్పత్తి కావాలంటే, అందుకు తోడ్పడే అలవాట్లు అలవరుచుకోవాలి. అవేంటంటే...


లక్ష్యం దిశగా: ఎంచుకున్న లక్ష్యానికి దినచర్యలో చోటు కల్పించాలి. అది చదువు కావచ్చు, వ్యాయామం కావచ్చు. 


ఉల్లాసం: ఉల్లాసవంతమైన పనుల్లో పాల్గొనాలి. డాన్స్‌ చేయడం, ఆటలాడడం, నచ్చిన పాటలు వినడం... ఏ పనితో ఉల్లాసం దక్కితే, ఆ పని కోసం సమయం కేటాయించాలి.


నిద్ర: రోజుకు 8 గంటలకు తగ్గకుండా నిద్ర పోవాలి. నిద్రలేమి డోపమైన్‌ ఉత్పత్తిని కుంటుపరుస్తుంది. దాంతో నిస్సత్తువ, మానసిక కుంగుబాటు వేధిస్తాయి. 


నవ్వు: మనసారా నవ్వడం అలవాటు చేసుకోవాలి. మనసు తేలికపరిచే సంభాషణల్లో మునగాలి. 


మెదడు వ్యాయామాలు: పజిల్స్‌, చిక్కుప్రశ్నలతో మెదడుకు వ్యాయామం అందించాలి. మెదడు చురుకుదనం పెంచడం ద్వారా కూడా డోపమైన్‌ ఉత్పత్తిని పెంచవచ్చు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.