ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

ABN , First Publish Date - 2022-08-18T05:30:00+05:30 IST

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహిం చారు.

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీవిద్యా మందిర్‌ పాఠశాలలో చిన్నారుల వేషధారణలు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 18: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహిం చారు. ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో చిన్నారులు గోపిక, కృష్ణుడి వేషధా రణలతో ఆకట్టుకున్నారు. లక్ష్మీపురం దగ్గర ఉన్న రిడ్జ్‌ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల సీఈవో గోపినాథ్‌, ప్రిన్సిపల్‌ రాజేంద్రన్‌ శ్రీకృష్ణుని విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మాంటిస్సోరి పాఠశాలల ప్రాంగణాల్లో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కర స్పాండెంట్‌ రాజశేఖర్‌, అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ రాధమ్మ, ప్రిన్సిపాల్‌ శశికళ, రమాజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నారాయణ పాఠశా లల్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మాధవీ నగర్‌లోని నారాయణ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజీఎం సురేష్‌, ప్రిన్సిపాల్‌ అల్తాఫ్‌ ఆధ్వర్యంలో చేసిన వేడుకలకు చిన్నారులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. బళ్లారి చౌరస్తాలోని శ్రీవిద్యా మందిర్‌ పాఠశాలలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఓర్వకల్లు:
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సమీపాన ఉన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరుపుకు న్నారు. శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓర్వకల్లులోని పొదుపులక్ష్మి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భాలభారతి పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచేత బాలకృష్ణుడి, గోపిక, రాధమ్మ వేషధారణలో చిన్నారులు చూడముచ్చటగా ఉన్నారు. తల్లిదండ్రులు గర్వపడేలా విద్య అభ్య సించి మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రిన్సిపాల్‌ సత్యబాబు కోరారు.

కోడుమూరు:
కృష్ణాష్టమి పండుగ వేడుకలను నాగార్జున స్కూల్లో గురు వారం నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ముస్తాబ య్యారు. పాఠశాల ఆవరణలో  ఉట్టి కట్టే కార్యక్రమంలో విద్యా ర్థులు ఉత్సా హంగా పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ఎద్దుల సూర్యరెడ్డి, నాగార్జున యాదవ్‌, ఎద్దుల సత్యరెడ్డి, యశస్విని, సురేంద్రరెడ్డి  పాల్గొన్నారు.



Updated Date - 2022-08-18T05:30:00+05:30 IST