జాతీయ స్ఫూర్తి నింపుతున్న త్రివర్ణ పతాకం

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

జాతీయ స్ఫూర్తి నింపుతున్న త్రివర్ణ పతాకం
పాలకోడేరులో జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

పాలకోడేరు, ఆగస్టు 8: ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన పాల కోడేరులో ఆజాది కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు 200 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం, జైహింద్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థుల వేషధారణ ఆకట్టుకున్నాయి. పాఠశాల హెచ్‌ఎం మహేష్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


భీమవరం టౌన్‌: స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను ప్రజలకు వివరించాలని స్వాతంత్య్ర సమరయోధుడు కలిదిండి సోమరాజు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో క్విట్‌ ఇండియా స్థూపం వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. నిర్వాహకుడు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పోలీసుల కాల్పులల్లో వేగేశ్న నారాయణరాజు, గొట్టుముక్కల బలరామరాజు, ఉద్దరాజు వెంకటరామరాజు, బాలుడైన ముం తా బ్రహ్మం మృతి చెందారన్నారు. ఇందుకూరి ప్రసాదరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యంరాజు, నరహరిశెట్టి కృష్ణ, గంటా సుందర కుమార్‌, కలిదిండి సోమరాజు, బొండా వెంకట సుబ్బారావును సత్కరించారు. అనంతరం 150 అడుగుల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. వేగిరాజు రాధాకృష్ణంరాజు, నాగేశ్వరరావు, మురళీకృష్ణ, షేక్‌బాబాజీసాహెబ్‌, తదితరులు పాల్గొన్నారు.


భీమవరం ఎడ్యుకేషన్‌: స్వాతంత్య్రం పోరాటయోధుల త్యాగ ఫలమని డీఎన్నార్‌ కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు అన్నారు. కళాశాల సీనియర్‌ డివిజన్‌ ఎన్‌సీసీ కాడెట్లు ఆధ్వర్యంలో పట్టణం లో జాతీయ సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ ఎంవి.భాస్కరరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌జె సోమరాజు, ఎన్‌సీసీ ఆఫీసర్‌ కెప్టెన్‌ ఎ.వీరయ్య, బీవీ.నరసింహరాజు, ఎన్‌సీసీ కాడెట్లు పాల్గొన్నారు.


పెంటపాడు: విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  అలంపురం టీబీఆర్‌ సైనిక్‌ పాఠశాల ఛైర్మన్‌ తనుబుద్ది భోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు.  జాతీయ జెండాను ఆవిష్కరించి, పాఠశాల ప్రాంగణంలోని కార్గిల్‌ అమర జవాన్‌ విగ్రహానికి నివాళులర్పించారు.  అనంతరం విద్యార్థులు జాతీయ జెండాతో  ర్యాలీ నిర్వహించారు. బి.శ్రీనివాస్‌, ఈతకోట తాతాజీ, దత్తు ప్రసాద్‌, కోట రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


పెనుమంట్ర: మార్టేరులో 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించాలని కోరారు. జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, ఎంపీపీ కర్రి వెంకట నారాయణరెడ్డి, సర్పంచ్‌ మట్టా కుమారి, మామిడిశెట్టి వేణుబాబు, వెంకటరెడ్డి సత్తి విష్ణుకుమార్‌ రెడ్డి, ఎంపీటీసీ అనురాధ, సత్యనారాయణ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST