
గుంటూరు: నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. ఆదివారం సీఎం జగన్ నరసరావుపేటలో పర్యటించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పల్నాడు రోడ్డులోని.. ఓ టీస్టాల్ బిల్డింగ్‌కు వైసీపీ నేతలు బ్యానర్ కట్టారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్ తొలగించారు. బ్యానర్ తొలగింపుతో టీస్టాల్ నిర్వాహకులతో వైసీపీ శ్రేణులు గొడవకు దిగారు. శనివారం అర్ధరాత్రి టీస్టాల్ ధ్వంసం చేసి నిర్వాహకులపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి